పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అందాల తార భూమిక మరోసారి వెండితెరపై కనిపించబోతున్నారా ? అంటే అవుననే అంటున్నారు ఫిలిం నగర్ వాసులు. ఎస్ జె సూర్యతో పవన్ కళ్యాణ్ తన తర్వాత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సేనాపతి అని హుషారు అని రెండు టైటిల్స్ సోషల్ సైట్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈసినిమాలో ఇప్పటికే శృతిహాసన్ ని హీరోయిన్ గా తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు కూడ. అయితే ఇప్పుడు ఒక ప్రత్యేక పాత్రలో భూమిక నటిస్తోందని ఫిలింనగర్ లో టాక్ మొదలైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సింగపూర్ ట్రిప్ ముగించుకుని వచ్చాడని, ఇక అధికారికంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోఈ సినిమాలో యోగా టీచర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కి యోగా నేర్పించేందుకు భూమికని ఎంపిక చేసినట్లుగా ఈ పాత్ర కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉంటుందని, అందులో కూడ పవన్ కళ్యాణ్ భూమిక నడుమును చూస్తూ టీజింగ్ చేసే సీన్ ఉంటుందని చెప్తున్నారు ఫిలిం నగర్ వాసులు.
మరి ఖుషి సినిమాలో భూమిక నడుం చూస్తే అంత గొడవ చేసింది ? ఇప్పుడు ఈ సినిమాలో ఇంకెంత గొడవ చేస్తుందో అని అంటున్నారు అందరూ. ఎస్ జె సూర్య ఇలాంటి సీన్స్ తీయడంలో ఆరితేరిన దిట్ట అని, ఖచ్చితంగా ఈ సీన్ చూసి ప్రేక్షకులు , అభిమానులు ఎంజాయ్ చేస్తారని చెపుతున్నారు.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more