పోకిరి, బిజినెస్ మాన్ సినిమాలతో తనలోని మాస్ యాక్షన్ ని చూపించిన మహేష్ బాబు మరోసారి పూరీ జనగన్నాథ్ తో మాస్ యాక్షన్ ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. 'జనగణమన' అనే టైటిల్ లో మహేష్ బాబుని ఊరమాస్ గా చూపించేందుకు పూరీ జగన్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లుగా ఫిలిం నగర్ లో టాక్ మొదలైంది.
ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ ని , డైలాగ్స్ ని , క్యారెక్టర్ ని మాస్ కి నచ్చే విధంగా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లుగా సమాచారం.
పూరి సినిమాలన్నీ దరిదాపు హీరో అనాథ, హీరోయిన్ని వెంటపడి ప్రేమిస్తాడు అన్న కాన్సెప్ట్ తో ఉంటాయి. డైలాగులు కూడా అలానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆయనికి వరస ఫ్లాపులు పలకరించడంతో రూటు మార్చాడట.
మహేష్ బాబు కోసం ఓ పక్కా ఊరమాస్ సినిమాని ఈ ట్రెండ్ కి తగ్గట్టు చూపించబోతున్నాడట. ఒక సామాజిక అంశాన్ని ముఖ్య కధాంశంగా తెరకెక్కించే పనుల్లో పూరీ అండ్ కో ఉన్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు ఇంతవరకు టచ్ చేయని ఊరమాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాని మాత్రం 2017 సంవత్సరంలోనే తెరకెక్కించేందుకు వీలు కుదురుతుందట. ఎందుకంటే, ఒక పక్క మహేష్ బాబు మురుగదాస్ సినిమాతో బిజీగా ఉండటం, మరో పక్క పూరీ జగన్ వరుసగా నందమూరి హీరోలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ఇప్పుడప్పుడే పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు.
కొసమెరుపు ఏంటంటే, ఈ సినిమాకి పూరీ జగన్ మహేష్ బాబు దగ్గర కేవలం 40రోజుల కాల్షీట్స్ మాత్రమే తీసుకున్నాడట. అందుకే సినిమా టైటిల్ తో సహా రివీల్ చేసి ఇప్పటినుంచే సినిమాపై ఆసక్తిని రేపుతున్నాడని చెబుతున్నారు సినీ పండితులు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more