టాలీవుడ్ లో ఎక్కడ చూసినా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కత్తిలాంటోడు గురించే చర్చలు ఎక్కువయ్యాయి. ఈ సినిమా షూటింగ్ విశేషాలు, అందులో నటించే నటీనటుల గురించి తెలుసుకునేందుకు మెగా అభిమానులు ఆసక్తి కనపరుస్తున్నారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ రమ్యకృష్ణను ఒక ముఖ్యమైన పాత్రలో తీసుకునేందుకు చూస్తున్నారట. సినిమాలో ఐఎయస్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ అయితే బాగుంటుందని, ఆ పాత్రకు ఇప్పుడున్నవాళ్లలో ఆమె అయితే సెట్ అవుతుందని డైరెక్టర్ వినాయక్ రమ్యకృష్ణ డేట్స్ తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.
బాహుబలి సినిమాలో తన నటనతో మళ్లీ తెలుగువారి మనసుదోచిన రమ్యకృష్ణ చిరంజీవితో కలిసి హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది. అయితే, మళ్లీ ఇప్పుడు 150వ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తుండటంతో అందరూ రమ్యకృష్ణ భలే ఛాన్స్ కొట్టేసిందిగా అంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీని తీసుకున్నారని, ఇప్పుడు సీనియర్ నటి రమ్యకృష్ణ కూడ నటిస్తుండటంతో కత్తిలాంటోడు సినిమాకి మరింత హైప్ వచ్చిందని చెప్తున్నారు సినీ విశ్లేషకులు.
కత్తిలాంటి 'మెగా' లుక్ కోసం...
- పరిటాల మూర్తి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more