Chiranjeevi | Nayanthara | 150th film | Ram charan | Stills

Nayanthara romance with chiranjeevi

Nayanthara Pairup with Megastar Chiranjeevi, Chiranjeevi Zumba dance, Chiranjeevi movie updates, Chiranjeevi stills, Chiranjeevi latest news, Chiranjeevi stills, Nayanthara movies, Nayanthara hot stills

Nayanthara Romance with Chiranjeevi: Megastar Chiranjeevi 150th film director vv vinayak. tamil kaththi remake into telugu. Ram Charan Producer.

మెగాస్టార్ కోసం కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫిక్స్?

Posted: 03/15/2016 01:12 PM IST
Nayanthara romance with chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడూ ప్రారంభమవుతుందోనని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో చిరు 150వ చిత్రంగా రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ మాత్రం గతకొద్ది కాలంగా ముందుకు వెళ్లడమే లేదు. ఏదో ఒక కారణంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకుండా ఆగిపోతుంది.

ఇప్పటికే ఈ చిత్ర స్ర్కిప్ట్ వర్క్ పూర్తయ్యాయని, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే.. చిరంజీవి సరసన హీరోయిన్ గా ఎవరు నటించనున్నారు అనే అంశం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడున్న స్టార్ అగ్ర హీరోయిన్లు అందరితో చిరంజీవి నటించారు. కానీ... అనుష్క, నయనతారలతో చిరంజీవి నటించలేదు.

‘స్టాలిన్’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అనుష్కతో చిరంజీవి స్టెప్పులేసాడు. అయితే ఈ 150వ సినిమాలో ముందుగా అనుష్కను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ... ‘బాహుబలి2’ సినిమాతో బిజీగా వుండటంతో చిరు సినిమాకు అనుష్క నో చెప్పేసింది. ఇక నయనతారను ఫైనలైజ్ చేసారు చిత్ర యూనిట్. ఇప్పుడున్న స్టార్, అగ్ర హీరోలందరితో నయనతార జతకట్టింది. చిరంజీవితో నయనతార నటించడం ఇదే తొలిసారి.

అయితే ఇటీవలే ఈ ప్రాజెక్టుకు నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, మే నెలలో ఈ సినిమా కోసం నయనతార డేట్స్ ఇచ్చినట్లుగా తెలిసింది. దీంతో ఇక షూటింగ్ ప్రారంభించేయాలని చిత్ర దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. ఏప్రిల్ నెలలో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రాంచరణ్ తన సొంత బ్యానర్ పై నిర్మించనున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Megastar Chiranjeevi  150th film  Kaththi remake  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more