NTR | Janatha Garage | Costly Watch | Gifts | Nithya menon | Samantha

Ntr costly gift to koratala siva

NTR Gifted Costly Watch to Koratala Siva, Janatha Garage Shooting Started, Janatha Garage Shooting updates, NTR Janatha Garage updates, NTR Janatha Garage details, NTR Janatha Garage movie news, NTR, Janatha Garage, Mohanlal, Nithya menon, samantha

NTR Costly Gift to Koratala Siva: Young tiger ntr latest film Janatha Garage. Koratala Siva Direction. Mohanlal acts in lead role. Nithya menon, Samantha heroines.

‘జనతా గ్యారేజ్’ దర్శకుడికి ఎన్టీఆర్ ఖరీదైన గిఫ్ట్

Posted: 02/24/2016 12:17 PM IST
Ntr costly gift to koratala siva

ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు రచయితగా పనిచేసిన కొరటాల శివ ఇటీవలే ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. దర్శకుడిగా తొలిసినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ చిత్రం భారీ విజయం సాధించడమే కాకుండా, ప్రభాస్ సినీ కెరీర్లో ఓ మంచి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ తో ‘శ్రీమంతుడు’ అనే చిత్రాన్ని తీసాడు కొరటాల శివ.

ఈ సినిమా విడుదలై కలెక్షన్ల మోత మోగించింది. ‘శ్రీమంతుడు’ చిత్రం భారీ విజయం సాధించి, కలెక్షన్ల వర్షం కురింపించడంతో... మహేష్ సంతోషంతో దర్శకుడు కొరటాల శివకు 50లక్షలు విలువ చేసే ఆడిఏ6 కారును బహుమతిగా ఇచ్చాడు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ వంటి రెండు వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తీసిన కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న మూడవ చిత్రం ‘జనతా గ్యారేజ్’.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. అయితే ఎన్టీఆర్ కు కొత్తరకం వాచ్(watches)లు అంటే ఇష్టం. ఎవరైనా తన సన్నిహితులు, ఫ్రెండ్స్ కు ఎక్కువగా వాచ్ లను గిఫ్ట్ గా ఇస్తుంటాడు. ‘జనతా గ్యారేజ్’ కోసం కొరటాల శివ ఓ అద్భుతమైన స్ర్కిప్టును సిద్ధం చేసాడు. ఆ కథ నచ్చడంతో కొరటాల శివకు ఎన్టీఆర్ ఓ ఖరీదైన బహుమతిని అందజేసినట్లుగా తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం... దాదాపు 20 లక్షలు విలువ చేసే వాచ్ ను కొరటాల శివకు ఎన్టీఆర్ బహుమతిగా ఇచ్చాడని తెలిసింది. కేవలం స్ర్కిప్ట్ నచ్చడం వల్లనే ఇంత భారీ గిఫ్ట్ ఇస్తే... ఇక సినిమా విడుదలై ఘన విజయం సాధిస్తే దర్శకుడికి ఎన్టీఆర్ ఎలాంటి బహుమతిని అందజేస్తాడో చూడాలి. అలాగే ‘జనతా గ్యారేజ్’ కోసం కొరటాల శివ దాదాపు 10కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలిసింది.

‘మిర్చి’ చిత్రానికి 50 లక్షలు, ‘శ్రీమంతుడు’ చిత్రానికి 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగా... ‘జనతా గ్యారేజ్’ కోసం ఏకంగా 10కోట్ల రెమ్యునరేషన్ తీసుకుండటంతో.. కొరటాల శివ రేంజు ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థం అవుతోంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమయ్యింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Gifted  Costly Watch  Koratala Siva  Janatha Garage  Nithya menon  samantha  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more