Nannaku Prematho | Theaters Problems | Dictator | Cold War | Ntr | Balakrishna

Theaters war between nannaku prematho and dictator

Theaters Problems for Nannaku Prematho, Nannaku Prematho Theaters Problems, Theaters war Nannaku Prematho, Nannaku Prematho vs Dictator, Nannaku Prematho theaters list, Nannaku Prematho hot news, Nannaku Prematho movie updates, Nannaku Prematho

Theaters war between Nannaku Prematho and Dictator: Young tiger Ntr Nannaku Prematho film will be release on 13 january. Nandamuri Balakrishna Dictator film will be release on 14 january.

వీరిద్దరి సినిమాలకు థియేటర్ల రచ్చ

Posted: 01/11/2016 12:15 PM IST
Theaters war between nannaku prematho and dictator

ఒక కుటుంబం అభిమానులను ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు, రెండు సినిమాలు వేరు చేయబోతున్నట్లుగా కనబడుతోంది. నందమూరి కుటుంబానికి చెందిన నందమూరి బాలకృష్ణ మరియు నందమూరి తారకరామారావు(జూ.ఎన్టీఆర్). నందమూరి తారల సినిమా విడుదలవుతుందంటే నందమూరి అభిమానుల్లో ఎంతో ఉత్సాహం ఏర్పడుతుంది. సినిమా విజయంలో నందమూరి అభిమానులదే కీలకం అని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి గల కారణం ‘డిక్టేటర్’ మరియు ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలు.

ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఈనెల 13న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఆ మరుసటి రోజున అంటే జనవరి 14న సంక్రాంతి కానుకగా బాలయ్య నటించిన ‘డిక్టేటర్’ చిత్రం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద ఉత్కంఠ మొదలయ్యింది. రాజకీయ ఎలక్షన్ల సమయంలో కూడా ఇంత ఉత్కంఠ వుంటుందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం రాజకీయ పరంగా, సినిమా పరంగా, అభిమానుల్లో భారీ ఉత్కంఠ మొదలయ్యింది.

ఇరు చిత్రాలు కూడా ఓ వారం రోజుల వాయిదా వేసుకొని విడుదల చేసినా కూడా మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం వుంది. కానీ అలా కాకుండా ఒకే రోజు తేడాతో రెండు సినిమాలు విడుదలవుతుండటంతో ఎన్టీఆర్ కు కాస్త నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా సినీవర్గాల అంచనా. ఇప్పటికే ‘డిక్టేటర్’ సినిమా ఆంధ్రాలోని చాలా థియేటర్లను సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది. ‘డిక్టేటర్’ కంటే ముందుగా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదలవుంది కాబట్టి.. ఆ ఒక్క రోజున ఆంద్రాలోని దాదాపు అన్ని థియేటర్లలో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదల కానుంది.

జనవరి 14న మాత్రం అందులో 75శాతం థియేటర్లలో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను తీసేసి, ‘డిక్టేటర్’ సినిమాను ప్రదర్శించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలిసింది. అసలే బాలయ్యకు భారీ క్రేజ్ వుండటం, అదే విధంగా రాజకీయపరంగా మంచి సపోర్ట్ వుండటంతో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి థియేటర్ల కరువు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొత్తానికి ‘డిక్టేటర్’ విడుదల వల్ల ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి థియేటర్ల కరువు ఏర్పడటం ఖాయమని సినీ వర్గాల అంచనా. ఇక 15వ తేదిన విడుదల కావాల్సిన నాగార్జున ‘సొగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం థియేటర్ల కరువు కారణంగా సినిమా విడుదలను వాయిదా వేసే ఆలోచనలో వున్నారు. భారీ సంఖ్యలో థియేటర్లు దొరికాకే ‘సొగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం విడుదల కానుంది. మరి ‘డిక్టేటర్’ దెబ్బకు ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nannaku Prematho  Theaters Problems  Dictator  Cold War  Ntr  Balakrishna  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more