‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ‘కంచె’ సినిమాతో నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న మెగా హీరో వరుణ్ తేజ ఇటీవలే ‘లోఫర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో ఎలాగైనా ఓ కమర్షియల్ హిట్ ను కొట్టాలనే వుద్దేశ్యంతో వున్నాడు వరుణ్.
‘లోఫర్’ తర్వాత వరుణ్ హీరోగా ‘కంచె’ దర్శకుడు క్రిష్ తో మరో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ‘రాయబారి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఇందులో వరుణ్ ఓ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.
కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో వరుణ్ చాలా కొత్తగా కనిపించనున్నాడని సమాచారం. అందుకోసం వరుణ్ క్యారెక్టర్ ను కొత్తగా డిజైన్ చేస్తున్నాడని తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సినిమా అయినా వరుణ్ కు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more