Amyra Dastur Grabs Kajal Agarwal's Chance In Ram Charan's Latest Flick Thani Oruvan Remake | Tollywood Gossips

Amyra dastur grab kajal agarwals chance ram charan thani oruvan remake tollywood gossips

Amyra Dastur news, Amyra Dastur movies, Amyra Dastur gossips, Amyra Dastur updates, Amyra Dastur controversies, Amyra Dastur thani oruvan remake, Amyra Dastur kajal agarwal, kajal agarwal controversies, kajal agarwal news, kajal agarwal photo gallery, kajal agarwal hot photo shoot, kajal agarwal Amyra Dastur controversy, thani oruvan remake movie, ram charan thani oruvan remake news

Amyra Dastur Grab Kajal Agarwals Chance Ram Charan Thani Oruvan Remake Tollywood Gossips : Amyra Dastur Grabs Kajal Agarwal's Chance In Ram Charan's Latest Flick Thani Oruvan Remake.

కాజల్ పాలిట అమైరా విలన్...?

Posted: 10/01/2015 06:33 PM IST
Amyra dastur grab kajal agarwals chance ram charan thani oruvan remake tollywood gossips

పంజాబి భామ కాజల్ అగర్వాల్ కి కాలం అంతగా కలిసి రావడం లేదనిపిస్తోంది. నిన్నటిదాకా తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతూ వరుస ఆఫర్లు చేజిక్కించుకన్న ఈ అమ్మడికి.. ఇప్పుడు కొద్దోగొప్పో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ మినహా తెలుగులో ఏ ఇతర సినిమాలు చేయట్లేదు. ఆఫర్లు రాక తన కెరీర్ ఎక్కడ గాడిలో పడుతుందోనని ఆందోళనలో మునిగివున్న కాజల్ కి.. ఇప్పుడు నటి అమైరా దస్తూర్ రూపంలో మరిన్ని కష్టాలు వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అమైరా వల్ల కాజల్ కి వచ్చిన నష్టమేంటి? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

తమిళంలో భారీ విజయం సాధించిన ‘తని ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే! రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి అప్పుడే అవసరమైన కార్యక్రమాలు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టిన ఈ చిత్రం యూనిట్.. హీరోయిన్ ఎంపిక విషయంలో వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని సంప్రదిస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జోరుగా సాగింది. చెర్రీ-కాజల్ కాంబోలో వచ్చిన చిత్రాలు ఘనవిజయం సాధించడంతో.. ఈసారి కూడా కాజల్ ని తీసుకుంటే సక్సెస్ సెంటిమెంట్ కలిసొస్తుందని యూనిట్ భావించి, ఆమెను తీసుకోవాలని అనుకున్నందట. అయితే.. ఇంతలోనే ఏమయ్యిందో తెలీదు కానీ.. చెర్రీ సరసన కథానాయికగా ‘అమైరా దస్తూర్’ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో ‘ఇస్సక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తమిళంలో ధనుష్ సరసన ‘అనేగన్’ చిత్రంలో, ఇమ్రాన్ సరసన ‘మిస్టర్ ఎక్స్’ సినిమాలోనూ కథానాయికగా నటించింది. ఆ చిత్రాలు అంతగా విజయం సాధించకపోయినా.. నటిగా అమైరాకు మంచి మార్కులే వచ్చి పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈమెని హీరోయిన్ గా తీసుకోవాలని యూనిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో.. కాజల్ కి వరించాల్సిన ఆఫర్ ఈ అమ్మడు ఎగరేసుకుపోయిందని అనుకుంటున్నారు.

అయితే.. ఇక్కడో చిన్న క్లారిటీ ఇంకా రావాల్సి వుంది. అదేమిటంటే.. కాజల్ ని కాదనుకుని అమైరాను సినిమాలో తీసుకున్నారా? లేక కాజల్ మాత్రమే కాకుండా రెండో కథానాయికగా ఈ కొత్త భామను ఎంపిక చేసుకున్నారా? అనే విషయమై సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి తమిళ్ రియల్ వెర్షన్ లో నయనతార ఒకతే హీరోయిన్ గా నటించింది. రెండు హీరోయిన్ ఆ సినిమాలో లేదు. కానీ.. తెలుగులో అందుకు భిన్నంగా ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నారేమోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అదీ కాకపోతే.. అమైరాను ప్రత్యేక పాత్ర కోసం ఎంపిక చేశారా? అని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ మొత్తం ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పడాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే! ఇదిలావుండగా.. ఎస్వీ ప్రసాద్ - డీవీవీ దానయ్య సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే అవకాశం వుందని టాక్ వినిపిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amyra Dastur  Ram Charan Thani Oruvan Remake  Kajal Agarwal  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more