Salman Khan | Mahesh Babu | Srimanthudu Remake

Salman khan in mahesh srimanthudu remake

Salman Khan in Srimanthudu movie remake, Salman Khan in Srimanthudu remake, Salman Khan Srimanthudu remake, Salman Khan Srimanthudu remake details, Salman Khan latest news, Salman Khan movies, Salman Khan movie news, Salman Khan, Mahesh Babu, Srimanthudu

Salman Khan in Mahesh Srimanthudu remake: Mahesh babu latest block buster hit film srimanthudu. koratala shiva direction, Shruti haasan heroine, devi sri prasad music.

శ్రీమంతుడుగా మారనున్న సల్మాన్ ఖాన్?

Posted: 09/08/2015 01:02 PM IST
Salman khan in mahesh srimanthudu remake

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఇటీవలే విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలలో నటించారు. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

ధనవంతులు ఏదైనా ఊరిని దత్తత తీసుకొని బాగుచేసుకుంటే.. ఈ దేశం బాగుపడుతుందనే మంచి మెసేజ్ తో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికే కొంతమంది కొన్ని ఊర్లను దత్తత తీసుకున్నారు.

అయితే ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి సల్మాన్ ఖాన్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. గతంలో మహేష్ నటించిన ‘పొకిరి’ చిత్రాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ ‘వాంటెడ్’ పేరుతో రీమేక్ చేసారు. హిందీలో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అయితే ఇపుడు ‘శ్రీమంతుడు’పై కన్నేసాడు సల్మాన్.

ఈ సినిమాను హిందీలో తానే రీమేక్ చేయడానికి సల్మాన్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసిందే. సల్మాన్ స్వీయ నిర్మాణంలో రూపొందనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Mahesh Babu  Srimanthudu  Remake  News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more