Ram Charan own production house title

Ram charan own production house title

Ram Charan own production banner title, Ram Charan own production banner, Ram Charan movie news, Ram Charan movie updates, Ram Charan latest news, Ram Charan movies, Ram Charan stills, Ram Charan latest updates, Ram Charan

Ram Charan own production house title: Mega power star Ram Charan starts own production. His first film with his father chiranjeevi. movie title Auto johnny.

రాంచరణ్ సొంత బ్యానర్ టైటిల్ ఇదేనా?

Posted: 06/24/2015 10:08 AM IST
Ram charan own production house title

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రముఖ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఆటోజానీ’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. చిరంజీవి నటించబోయే 150వ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ తన సొంత బ్యానర్లో నిర్మించనున్నాడనే విషయం తెలిసిందే.

మరి సొంత బ్యానర్ పేరు ఏమయ్యి వుంటుందా అని అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సొంత బ్యానర్ కు ఓ పేరు ఖరారు చేసినట్లుగా తెలిసింది. ఈ బ్యానర్ కు ‘రాంచరణ్ ఎంటర్ టైన్మెంట్స్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా తెలిసింది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగష్టులో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. భారీ అంచనాలతో రూపొందనున్న ఈ చిత్ర కథ ఫస్ట్ హాఫ్ ను ఇటీవలే దర్శకుడు పూరీ జగన్నాథ్ చిరంజీవికి వినిపించాడట. చిరు విని చాలా సంతోషంగా వున్నాడట. ఫస్ట్ హాఫ్ ను మించి, సెకండ్ హాఫ్ వుండేలా పూరీ మరింత అద్భుతంగా కథను సిద్ధం చేస్తున్నారు.

అలాగే రాంచరణ్ నటిస్తున్న కొత్త చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన తొలిసారిగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో ప్రముఖ నిర్మాత దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Production  Auto Johnny  Puri Jagannath  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more