పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మళ్లీ గందరగోళ పరిస్థితికి లోనవుతున్నారు. తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’ తర్వాత ‘గబ్బర్ సింగ్2’ తెరకెక్కనుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లుక్ చూస్తుంటే.. ‘గబ్బర్ సింగ్2’ కంటే ముందుగా మరో చిత్రం తెరకెక్కే అవకాశాలున్నట్లుగా కనిపిస్తోంది.
‘గోపాల గోపాల’ తర్వాత పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్2’ చిత్రంలో నటించబోతున్నాడని, స్ర్కిప్టు పనులు, ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లుగా చిత్ర నిర్మాత శరత్ మరార్, చిత్ర దర్శకుడు బాబీ ప్రకటించిన విషయం తెలిసిందే.
‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ కాస్త స్లిమ్ గా, గడ్డం లేకుండా కొత్తగా కనిపించిన విషయం తెలిసిందే. ‘గబ్బర్ సింగ్2’లో కూడా అలాగే వుండబోతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ లుక్ ను చూస్తుంటే ‘గబ్బర్ సింగ్2’ స్టైల్ మొత్తం మార్చేసినట్లుగా అనిపిస్తుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాగా వెంట్రుకలు, గడ్డం, మీసాలు పెంచేసి ఆకలితో వున్న సింహం వలే కనిపిస్తున్నాడు. అయితే ఈ కొత్త లుక్ ఏ సినిమా కోసమో అని అభిమానులు తీవ్రంలో చర్చలు జరుపుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ కొత్త లుక్ ‘గబ్బర్ సింగ్2’ కోసం కాకుండా ‘కోబలి’ కోసం తయారయినట్లుగా తెలిసింది.
‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘కోబలి’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుందని గతకొద్ది కాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా విడుదలై మంచి విజయం సాధించడంతో.. తన తరువాతీ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తోనే చేయడానికి త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది.
పవన్ కళ్యాణ్ ‘కోబలి’ చిత్రం కోసం ఇలా కొత్త లుక్ లో కనిపిస్తున్నాడని సినీవర్గాల సమాచారం. కానీ ‘గబ్బర్ సింగ2’ చిత్ర దర్శకనిర్మాతలు మాత్రం మరో రెండు నెలల్లో తమ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ ఇపుడు ఏ సినిమా మొదలుపెట్టనున్నాడో.. అసలు పవన్ ఈ కొత్త లుక్ ఏ సినిమా కోసం రెడీ అయ్యాడో తెలియక అభిమానులు తెగ కంగారుపడుతున్నారు. మరి ఈ విషయంపై పవన్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.
video courtesy: MAA TV
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more