నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 98వ చిత్రం ‘లయన్’ విడుదలకు సిద్దమవుతోంది. సత్యదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి సినిమా సంస్థలో నిర్మాత రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నేడు శిల్పకళా వేదికలో ఘనంగా జరుగనుంది. ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
‘లయన్’ తర్వాత బాలయ్య తన 99వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార మొదటి హీరోయిన్ గా నటించనుంది. అయితే రెండవ హీరోయిన్ గా హన్సిక, రెజీనాల పేర్లు వినిపించాయి. కానీ తాజాగా అంజలిని ఖరారు చేసినట్లుగా సమాచారం.
అంజలి ఇప్పటికే అగ్ర హీరో వెంకటేష్ సరసన రెండు సినిమాల్లో జోడిగా నటించింది. యువ హీరోలతో నటిస్తూనే, అగ్ర హీరోలతో కూడా జతకడుతున్న ఈ భామను తాజాగా బాలయ్య సినిమాలో రెండవ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇందుకోసం అంజలి భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలిసింది.
అయితే అంజలి ఈ సినిమా చేయడానికి రచయిత కోన వెంకట్ ప్రోత్సాహం వున్నట్లుగా తెలిసింది. ఎందుకంటే ఈ చిత్రానికి కోన వెంకట్ కథను అందిస్తున్నారు. ఇటీవలే అంజలి నటించిన ‘గీతాంజలి’ చిత్రానికి కోనవెంకట్ స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ ను అందించారు. పైగా వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా వుంది. అందుకే బాలయ్య సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అంజలిని ప్రోత్సహించడానికి కోన వెంకట్ కారణమని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే ఈ విషయంపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం ఈ 99వ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు పనులు, ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో వున్నట్లుగా తెలిసింది. మే నెలలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. కోన వెంకట్, గోపి మోహన్ లు కథను సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more