మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న కల.. మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే వేదికపై చూడలని. కానీ గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు మాత్రం అందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టే ముందు అన్న చిరంజీవికి వెన్నుదన్నుగా నిలిచారు పవన్ కల్యాణ్. అయితే తరువాత పార్టీలో పరిస్థితుల కారణంగా పవన్ కల్యాణ్ చిరంజీవితో కాస్త దూరంగా ఉన్నారని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ స్వంతంగా పార్టీని పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అలా పార్టీల పేరుతో మెగా ఫ్యామిలీలో కాస్త దూరం పెరిగిన మాట వాస్తవమే.. మరి ఆ దూరం ఎప్పటికి దగ్గరవుతుంది.. మెగా ఫ్యామిలి ఎప్పటికి ఒకే వేదికపై కనిపిస్తుంది అన్న ప్రశ్నకు సమాధానమే ఈ స్టోరీ..
మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ ప్రపంచంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు ఇద్దరూ. మెగా ఫ్యాన్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. తమ అభిమాన నటుల ఫ్యామిలీ కోసం ఏం చెయ్యడానికైనా సిద్దంగా ఉంటారు వారు. అయితే మెగా ఫ్యాన్స్ ఎంతో కాలంగా ముగ్గురు మెగా సోదరులను ఒకే వేదికపై చూడాలని కోరికతో ఉన్నారు. కానీ అవి ఎంతకీ నెరవేరడం లేదు. అయితే నాగబాబు అన్నయ్యను, తమ్ముడిని ఒకే వేదికపైకి తీసుకు వస్తానని మాటిచ్చాడు. అయితే అది ఎప్పుడు అన్నది మరో ప్రశ్న.
చిరంజీవి పార్టీని స్థాపించాక సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే మెగా అభిమానుల కోరిక మేరకు మరోసారి తెర మీద మెరుపులు మెరిపించడానికి ఆయన సిద్దంగా ఉన్నారు. తన 150 సినిమాకు కథ సిద్దంగా ఉంటే చెయ్యడానికి రెడీ అని స్పష్టం చేశారు కూడా. అయితే 150 సినిమా పై మాత్రం ఇప్పటి వరకు క్లారీటీ రాలేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా ఫంక్షన్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కలిసి కనిపించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి అది నిజమవుతుందో.. మెగాఫ్యాన్స్ కోరిక తీరుతుందొ చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more