నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘లయన్’. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమా సంస్థలో నిర్మాత రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ స్టిల్స్, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తోంది. ఇంకా ఈ చిత్ర పోస్టర్లు, థియేటర్ ట్రైలర్ విడుదలకాక ముందే ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇటీవలే ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్మడు పోయాయి.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర పాటలను ఏప్రిల్ 9న ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ‘లయన్’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఘనంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లుగా తెలిసింది.
అలాగే ఈ చిత్రాన్ని మే1వ తేదిన విడుదల చేయబోతున్నట్లుగా సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more