దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ చిత్రానికి విడుదల సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. అందుకే.. ముందుగా అనుకున్న తేదీకి కాకుండా ఈ మూవీ రిలీజ్ డేట్ ను వాయిదా వేసినట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఇండస్ట్రీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీని మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్ వస్తోంది.
మొదటగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా ఇదివరకే చిత్రబృందం ప్రకటించింది. కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యంగా జరుగుతున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ ని వాయిదా వేసినట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు.. ఈ మూవీలోని చివరి పాట చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నిజానికి ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ లోనే పూర్తి కావాల్సి వుండేది కానీ.. ప్యాచ్ వర్క్ వుండటం వల్ల షూటింగ్ ఆలస్యమైంది. అందుకే.. ఈ మూవీని ఏప్రిల్ 17వ తేదీన విడుదల చేయడానికి సాధ్యపడదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఈ చిత్రానికి హాలీవుడ్ కు చెందిన సాంకేతిక నిపుణులతో గ్రాఫిక్స్ వర్క్స్ సమకూర్చుతున్న నేపథ్యంలో ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతున్నట్లు తెలిసింది. దీంతో.. ఈ మూవీ షూటింగ్, ఇంకా ప్యాచ్ వర్క్ ను గమనిస్తుంటే.. మూవీ రిలీజ్ ఏప్రిల్ లో కాకుండా మే నెలలో వాయిదా పడుతుందని అంటున్నారు. ఒకవేళ ప్రొడక్షన్ పనులు ఆలస్యమైతే.. జూన్ మొదటి వారంలో విడుదల తేదీ వాయిదా పడే సూచనలున్నాయని యూనిట్ వర్గాలవారు అంటున్నారు. ఈ మూవీ విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారని సమాచారం! ఏదైతేనేం.. మొత్తానికి ‘బాహుబలి’ చిత్రానికి కూడా రిలీజ్ కష్టాలు తప్పడం లేదన్నమాట!
150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ‘బాహుబలి’లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే! ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more