Sonakshi sinha mental problems bollywood celebrities muragadoss movie plan

sonakshi sinha news, sonakshi sinha hot photo shoot, sonakshi sinha backless, sonakshi sinha muragadoss news, ar muragadoss movie news, sonakshi sinha cleavage, sonakshi sinha hot gallery, sonakshi sinha movies

sonakshi sinha mental problems bollywood celebrities muragadoss movie plan : Tamil ace director muragadoss planning to make movie with sonakshi sinha in which she is playing a character who is suffering from mental problems.

సోనాక్షిని వెంటాడుతున్న మానసిక సమస్యలు..

Posted: 02/05/2015 01:59 PM IST
Sonakshi sinha mental problems bollywood celebrities muragadoss movie plan

‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్ తెరకు ఎంట్రీ ఇచ్చిన సోనాక్షీ సిన్హా.. అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజీని సాధించింది. తండ్రి వారసత్వంతో పరిశ్రమలో వచ్చినప్పటికీ.. తన అందంతో, నటనాప్రతిభతో అందరినీ మైమరిపించింది. అందుకే.. ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తుంటాయి. ప్రస్తుతం ఈ అమ్మడికి వున్న రేంజ్ బాలీవుడ్’లో ఏ తారకూ లేదు. కానీ.. ఎవరికీ తెలియని కొన్ని మానసిక సమస్యలను మాత్రం ఈమెను వెంటాడుతున్నాయట! అన్ని సౌకర్యాలు అందుబాటులో వున్న.. ఈ అమ్మడు వాటితో సంతృప్తి చెందలేకపోతోందని, కెమెరాముందు నవ్వుతున్నా మనసులో మాత్ర ఆవేదనకు గురవుతోందని సమాచారం! ఈమె పడుతున్న మనోవేదనను చూసి ఇండస్ట్రీలో వున్నవాళ్లు ఈమెపై జాలీ చూపుతున్నారట! అంతా సవ్యంగానే జరుగుతున్నా.. ‘సోనాక్షీకి ఈ కష్టాలెందుకో?’నంటూ ప్రశ్నించుకుంటున్నారు. అయితే.. ఇదంతా రియల్ లైఫ్’లో కాదులెండి.. రీల్ లైఫ్ లో!

కమర్షియల్, సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఏ.ఆర్.మురగదాస్.. హిందీలో ఓ సరికొత్త కథాంశంతో చిత్రాన్ని తీయాలని గతకొన్నాళ్ల నుంచి ప్లాన్ చేస్తున్నాడట! తాను సిద్ధం చేసుకున్న కథలో మెయిన్ లీడ్ పాత్రకు సోనాక్షీ సిన్హాయే సరిపోతుందన్న భావనతో ఆమెను ఈ చిత్రంలో తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట! ఈ సినిమా కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుందని, ఇందులోనే ఆమె మానసిక సమస్యలున్న అమ్మాయి పాత్రను పోషిస్తుందని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ పాత్ర ఆమెకు ఛాలెంజింగ్’గా వుంటుందని యూనిట్ బృందం చెబుతోంది. సస్సెన్స్ థ్రిల్లర్’తో కూడిన కథాంశాన్ని తయారుచేసుకున్న నేపథ్యంలో సోనాక్షియే ప్రధాన పాత్రకు సరిపోతుందన్న నమ్మకంతో.. మురగదాస్ ఆమె డేట్స్’ను ముందుగానే బ్లాక్ చేసి పెట్టుకున్నాడని సమాచారం!

ఇక ఇందులో ఆమెకు జోడీగా అర్జున్ కపూర్’ని తీసుకునే యోచనలో దర్శకుడు మురగదాస్ వున్నాడు. అలాగే ఇతర పాత్రలకోసం కావాలసిన ఆర్టిస్టుల ఎంపిక కోసం డైరెక్టర్ ముంబైలోనే వున్నాడని, మార్చి నుంచి ఈ మూవీ షూటింగ్’ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. మరి.. ఈ చిత్రానికి సోనాక్షీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..? లేదా..? అన్నది ఇంకా తెలియాల్సి వుంది. ఒకవేళ ఆమె ఈ మూవీకి ఓకే చెబితే.. నిజంగా ఆమె కెరీర్’లో ఈ చిత్రం ఓ మైలురాయి అవుతుందని చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonakshi sinha mental problems  director ar muragadoss  bollywood gossips  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more