Dubbing artist raveena ravi replaced by singer sripada chinmayi for samantha from katti movie

dubbing artist raveena ravi, singer sripada chinmayi, samantha latest news, samantha dubbing artists, telugu dubbing artists, samantha hot photo shoot, katti movie, kathi movie news, sripada chinmayi news, raveena ravi news

dubbing artist raveena ravi replaced by singer sripada chinmayi for samantha from katti movie

గాయని చిన్మయికి సమంత మోసం చేసిందా?

Posted: 10/07/2014 07:03 PM IST
Dubbing artist raveena ravi replaced by singer sripada chinmayi for samantha from katti movie

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న గ్లామర్ డాల్ సమంత.. డబ్బింగ్ ఆర్టిస్ట్ - గాయని శ్రీపాద చిన్మయికి మోసం చేసిందనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా ఆఫర్లు సాధించుకుంటూ, విజయాలు నమోదు చేసుకుంటున్న ఈ అమ్మడి ప్రవర్తనలో రానురాను చాలా మార్పులు కనిపిస్తున్నాయని కొంతమంది విశ్లేషకులు తెలుపుతున్నారు. అందుకే గతంలో ఈ అమ్మడు మహేష్ బాబులాంటి స్టార్ హీరో సినిమాలు ‘‘నేనొక్కడినే, ఆగడు’’లపై బ్యాడ్ కామెంట్లు చేసి, అభిమానుల ఆవేశానికి బలైందని తెలుపుతున్నారు. ఆ కోవలోనే ఈ అమ్మడు మరోసారి తన ఆవేశాన్ని గాయని చిన్నయి మీద ప్రదర్శించిందని వార్తలు కొనసాగుతున్నాయి.

నిజానికి తమిళ, తెలుగు సినిమాల్లో గాయని - డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న శ్రీపాద చిన్మయి చాన్నాళ్లనుంచి సమంతకు వాయిస్ అందించేది. నిజంగానే సమంత మాట్లాడుతుందేమోనన్నంతగా చిన్నయి వాయిస్ ఆమెకు సూటయింది. అందుకే చిన్మయి చాలా సినిమాల్లో సమంతకు తన గొంతును ప్రసాదించింది. ఆమె వాయిస్ ఫిదా అయిన ప్రేక్షకులు ఎంతోమంది ఆమెకు అభిమానులు కూడా అయ్యారు. అయితే ఇంతలోనే వీరిమధ్య ఏం జరిగిందో గానీ.. సమంతకు ఇకనుంచి చిన్మయి తన వాయిస్ ను అందించబోదనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటినుంచి సమంతకు అమలాపాల్ కు డబ్బింగ్ చెప్పిన రవీనా రవి తన వాయిస్ ను అందించనుందని తెలిసింది. దీపావళికి విడుదల కానున్న ‘‘కత్తి’’ సినిమా నుంచే రవీనా తన వాయిస్ ను సమంతకు అందించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఆమె స్టూడియోలో హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ తో కలిసి దిగిన ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

అచ్చం సమంతలాగే మాట్లాడుతున్నంతగా తన వాయిస్ ను అందించిన చిన్మయిని ఇలా హఠాత్తుగా మార్చేసిన నేపథ్యంలో... సమంత ఆమెను మోసం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే చిన్మయితో అభిప్రాయ భేదాలు రావడం వల్లే సమంతా ఆమెను తప్పించినట్లుగా సమాచారం! దీంతో సమంత వాయిస్ ఇకనుంచి మారనుందన్నమాట! ఇన్నాళ్లు చిన్మయి గొంతుకు అలవాటు పడిన ప్రేక్షకులు రవీనా వాయిస్ ను ఆస్వాదిస్తారో లేదో వేచి చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dubbing artist raveena ravi  singer sripada chinmayi  samantha  kathi movie  samantha  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more