Bollywood baadshah shahrukh khan disrespect ileana in his latest press meet

ileana, ileana latest news, ileana hot photo shoot, ileana bikini photo shoot, ileana hot gallery, ileana shahrukh khan, shahrukh khan ileana news, fan movie news, ileana shahrukh khan fan movie, fan movie news

bollywood baadshah shahrukh khan disrespect ileana in his latest press meet

ఇలియానాను పబ్లిక్ లో అగౌరవపరిచిన షారుఖ్!

Posted: 10/07/2014 04:51 PM IST
Bollywood baadshah shahrukh khan disrespect ileana in his latest press meet

మనసులో వున్న అక్కసునంతా టాలీవుడ్ మీద వెళ్లగక్కేసి బాలీవుడ్ కి చెక్కేసిన గోవా బ్యూటీ ఇలియానాకు భారీగా అవమానం జరిగినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కంటే బాలీవుడ్ చాలా బాగుందని, అక్కడి స్టార్ హీరోలంతా తనను ఎంతగానో చేరదీసుకుంటున్నారని ఒకప్పుడు పేర్కొన్న ఇల్లీకి.. ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక స్టార్ హీరో ఆమెను పబ్లిక్ లో అగౌరవపరిచాడని వార్తలు వస్తున్నాయి. ఆ స్టార్ హీరో మరెవ్వరో కాదు.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్! ఇటీవలే షారుఖ్ సనసన ‘‘ఫ్యాన్’’ మూవీలో ఇలియానా నటిస్తున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో.. ఇప్పుడు షారుఖ్ ఆమెను ఇలా పబ్లిక్ లోనే అవమానించడం చర్చనీయాంశంగా మారిపోయింది.

యశ్ రాజ్ ఫిలిమ్స్ షారుఖ్ తో కలిసి నిర్మిస్తున్న ‘‘ఫ్యాన్’’ భారీ చిత్రాన్ని ‘‘బ్యాండ్ బాజా బారాత్’’ ఫేం మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీపై షారుఖ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఎందుకంటే.. ఇందులో ఈ బాద్షా పలురకాల గెటప్స్ వేయనున్నాడు. ఇందుకోసం షారుఖ్ ఇప్పటికే ఆ గెటప్స్ ను రెడీ చేసుకునే పనిలో బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలోనే తాను సినిమాలోని కథానాయిక గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు స్టార్ హీరోయిన్ అవసరం లేదు. నటులపై ప్రేక్షకులు ఏర్పరుచుకునే అభిమానం ఎలా వుంటుందనే నేపథ్యం మీద ఈ సినిమాను రూపొందించడం జరుగుతోంది. ఇన్నాళ్లవరకు నేను నటించిన అన్ని సినిమాల్లోకంటే ఇది చాలా ఛాలెంజింగ్ గా కూడినది’’ అంటూ పేర్కొన్నాడు. తనవరకు బాగానే చెప్పుకున్నాడు కానీ.. ఈ సినిమాకు స్టార్ హీరోయిన్ అవసరం లేదనే విషయమే ఇక్కడ చర్చనీయాంశంగా మారిపోయింది.

ఈ సినిమాలో షారుఖ్ తో పాటు ఇలియానా ఎంపికైనట్లు ఇటీవలే వార్తలు షికార్లు చేసిన సంగతి తెలిసిందే! షారుఖ్ చెప్పిన మాటల ప్రకారం.. ఇలియానా స్టార్ హీరోయిన్ కాదని అర్థం! అంటే.. బాలీవుడ్ లో ఇతర హీరోయిన్లలాగా ఈ అమ్మడు బాగా పేరు సంపాదించుకోలేదని.. ఈ గోవా బ్యూటీకి ఆ స్థాయి లేదని ఆయన పేర్కొన్న మాటలనంతరం ప్రచారాలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ అమ్మడికి పబ్లిక్ లోనే అవమానం జరిగినట్లైంది. ఇలియానా బాలీవుడ్ లో అడుగుపెట్టి ఇంకా కొన్నాళ్లు మాత్రమే అయింది కాబట్టి... ఆమెను కొత్త తారగా భావించి షారుఖ్ ఇలా కామెంట్లు చేశాడని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా.. ఇలియానాకు మాత్రం ఘోరమైన అవమానం జరిగిందని మీడియాలో వార్తలు జోరుగా కొనసాగుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : shahrukh khan  ileana dcruz  fan movie  bollywood news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more