ప్రిన్స్ మహేష్ బాబు ఆగడు సినిమా కోసం మరికొంతకాలం ఆగాల్సిందే. ముందుగా అనుకున్నట్లుగా సెప్టెంబర్ నెలలో ఈ సినిమా విడుదల కావటం లేదు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుగుతోంది. ఈనెల 23 వరకు మహేష్ తమన్నాలపై ఓ పాటను యూరప్ లో షూట్ చేసేలా షెడ్యూల్ ఉంది. కాబట్టి అక్కడి నుంచి సినిమా యూనిట్ వచ్చి, పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టి పూర్తయ్యే సరికి మరో యాబై రోజులు పడుతుంది. అంటే ముందుగా అనుకున్నట్లు సెప్టెంబర్ 19 లేదా 26కు సినిమా ఫస్ట్ కాపి బయటకు రాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం వల్లే రిలీజ్ ఆగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్టోబర్ లో విడుదల చేయాలని సినిమా పెద్దలు బావిస్తున్నారు. మామూలుగా సినిమాలు విడుదలయ్యేది శుక్రవారమే. అక్టోబర్ 3న శుక్రవారం కావటంతో ఆ రోజున సినిమా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట.
అయితే ఆడియో విడుదలలో మాత్రం ఆగడు దూకుడు పెంచి మూడ్రోజుల ముందుకు దూసుకొచ్చింది. మహేష్ కొడుకు గౌతమ్ బర్త్ డే అయిన ఆగస్ట్ 31న ఆడియో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే పలు కారణాలతో ఈనెల 28నే పాటలను విడుదల చేస్తామని చెప్పారు. అభిమానులను దృష్టిలో ఉంచుకుని శిల్పకళా వేదికలో ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. మహేష్ తమన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. దూకుడు తర్వాత మహేష్-శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది. ఇందులో కూడా సూపర్ స్టార్ పోలిస్ గెటప్ లో కన్పిస్తాడట. ఇక వైట్ల డైరెక్షన్ కావటంతో కామెడి వెతుక్కోవాల్సిన పని ఉండదని చెప్పాలి. ఓ ఫుల్ టైం ఎంటర్ టైన్ మెంట్ గా సినిమా ఉంటుందని ఇప్పటికే టాక్ వచ్చేసింది. 14 రీల్స్ బ్యానర్ పై వస్తున్న ఈ ఆగడుకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more