Salman to remake happydays movie in bollywood

salman khan, salman khan own banner, bollywood news, salman khan movies, salman khan news, happy days, shekar kammula, tollywood updates, tollywood news

salman khan intrested to remake happy days movie in bollywood with shekar kammula : salman plans to remake happy days movie in hindi by his own banner

తెలుగు సినిమా కావాలంటున్న సల్మాన్

Posted: 08/12/2014 06:22 PM IST
Salman to remake happydays movie in bollywood

సరుకు మంచిదయితే ఎక్కడయినా అమ్ముడవుతుంది. మన దగ్గర టాలెంట్ ఉంటే ఎక్కడైనా గుర్తింపు వస్తుంది. శేఖర్ సినిమాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఒక క్లీన్ వర్క్ తో, సింపుల్ గా ది బెస్ట్ అనిపిస్తాయి ఆయన సినిమాలు. అంత సింపుల్ గా, నీట్ గా తీయటం ఆయన వల్లే అవుతుంది. ఫైట్ లంటే ఎక్కువగా ఇష్టపడని కమ్ములపై ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కన్ను పడింది. అసలు పొంతనే లేని ఈ కాంబినేషన్ ఏం చేస్తుందా అనే కదా ఆలోచనకు సమాధానం ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపిడేస్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారు సల్మాన్. ఇందుకు సంబంధించి తెలుగు దర్శకుడితో అప్పుడే సంప్రదింపులు మొదలుపెట్టినట్లు గుసగుసలు వస్తున్నాయి.

హ్యాపీడేస్ తెలుగులో చెప్పుకోదగ్గ హిట్ సినిమాల్లో ఒకటి. ఇంకా చెప్పాలంటే ఈ తరం యువతకు నచ్చే సినిమాల్లో ఈ సినిమా పేరు ముందుగా విన్పిస్తుంది. ఇప్పటికీ ఏ కాలేజీలో ఫ్రెషర్స్ డే అయినా, ఫేర్ వెల్ డే అయినా ఈ సినిమా పాటలు తప్పనిసరిగా విన్పిస్తాయి. లేదంటే ఆ ఫంక్షన్ పూర్తి కానట్లే లెక్క. అంతగా దగ్గరయింది ప్రేక్షకులకు ఈ సినిమా. ఈ క్రెడిట్ శేఖర్ కమ్ములకే దక్కుతుంది. ఒక ఇంజనీరింగ్ కాలేజి స్టూడెంట్స్ జీవితాన్ని అందంగా చూపించటంలో సక్సెస్ అయ్యారు. టాలీవుడ్ లో ఇంత హిట్టయిన హ్యాపిడేస్ సినిమాపై సల్మాన్ కన్నుపడింది. ఆయన ఈ సినిమాను బాలీవుడ్ అభిమానులకు రుచి చూపించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.

అయితే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్, కాలేజి స్టూడెంట్స్ సినిమా కావటంతో ఈ సినిమాలో సల్మాన్ నటించటం లేదు. అన్నట్టు కండలవీరుడు ఈ మద్యే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. సినిమాలు చేసి బాగానే సంపాదించిన డబ్బులు ఇప్పుడీ సంస్థతో తానే సినిమాలు తీస్తాడట. అదేమంటే కూటి కోసం కోటి విద్యలు తప్పవని చెప్పాడు. సొంత బ్యానర్ సినిమాలపై ఆలోచిస్తున్న సల్మాన్ కు హ్యాపిడేస్ గురించి సన్నిహిత స్నేహితులు చెప్పారు. దీంతో వెంటనే ఈ సినిమా గురించి తెలుసుకుని దాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. హిందీలో కూడా హ్యాపిడేస్ కొనసాగుతుందా లేక మారుతుందా నిర్ణయించుకోలేదు. అయితే రీమేక్ ను కూడా శేఖర్ కమ్ములచే తీయించాలని సల్మాన్ భావిస్తున్నాడు. ఆయన అయితేనే ఆ కథను మళ్ళి అలా తీయగలరని సల్మాన కూడా గుర్తించాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  happydays  shekar kammula  tollywood news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more