Fans gift to samantha

samantha, fans gift to samantha, beautiful actress samantha, samantha photos, die hard fan of samantha, samantha movie, bubbly girl samantha

fans gift to samantha

అభిమానిది చూసి భయపడిన సమంత?

Posted: 06/30/2014 04:33 PM IST
Fans gift to samantha

అల్లరి .. చిల్లరి  రొమాన్స్ పిల్ల సమంత అని అందరి తెలుసు.  తన రొమాన్స్ అల్లారితోనే.. ఎదుటివారికి ఫీజులు ఎగిరిపోయేవిధంగా.. నటించగల చెన్నై చిన్నది.. సమంత.  ఆమె మాటల్లో  మధుర్యం లేకపోయిన, సమంత వయ్యారి వగలు పోతూ చిట్టి బుగ్గల కైపుతో  కవ్విస్తూ, కుర్రోళ్లో గుండెలను మాయం చేసే చెన్నై మాల్  సమంత.

అలాంటి చిన్నదానికి..  ఒక అభిమాని  షాకిచ్చాడు.   సమంతాకు అతను వీరాభిమాని.  అతని చేతి నిండా సమంతా బొమ్మలే.?  అతను కళ్లు ముసుకొని  సమంతా రూపాన్ని గీయగల సత్తా ఆ అభిమానిలో పుష్కలంగా ఉంది.  అయితే  తన అభిమాన హీరోయిన్ కు ఏదైన మంచి గిప్ట్ ఇవ్వాలని  భావించి.. నెల రోజులు రాత్రి, పగలు  కష్టపడి  సమంత కోసం  మంచి బహుమతి  సిద్దం చేయటం జరిగింది.  ఇక సమంతాకు ఇవ్వటమే  ఆలస్యం.  ఆరోజు రానే వచ్చింది.

Samantha-Gift-01

కోలీవుడ్  హీరో  సూర్యతో..‘అంజాన్’ అనే సినిమా  సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ విషయం తెలుసుకున్న  సమంతా అభిమాని.. ఆ బహుమతి తీసుకొని   అంజాన్ షూటింగ్ స్పాట్ కు వెళ్లి.. ప్రేమతో  తన కలల సుందరి సమంతా బహుమతి ఇవ్వటం జరిగింది.  ఆ సమయంలో సమంత అభిమానిపై 100 శాతం ప్రేమ కురిపించి, దగ్గరకు  తీసుకొని  ప్రేమతో  ఒక హాగ్  ఇవ్వటంతో.. అభిమాని మనసు మాయమైంది?  సమంతా ఇచ్చిన కౌగిలింత నుండి తెరుకోవటానికి  పది సంవత్సరాల సమయం పడుతుందని షూటింగ్  సిబ్బంది అంటున్నారు.

అయితే సమంతాలో ఆరాటం , ఎక్కువై.. అభిమాని ఏం గిప్ట్ ఇచ్చాడో అనే టెన్షన్ తట్టుకోలేక..  వెంటనే.. ‘‘అభిమానిది  ఇచ్చిన బహుమతి చూసి షాక్ తిన్నది’’ ఒక్క మాటలో చెప్పాలంటే.. అభిమానిది చూసి సమంతా భయపడి వణికిపోయింది. వెంటనే  చేతిలో ఉన్న గిప్ట్ ను తీసి ఆవతలపారేసింది.  అసలు ఇంతకీ అందులో ఏముంది?  సమంతా ఎందుకు భయపడిందో  షూటంగులో ఉన్న హీరో సూర్యకు, చిత్ర సిబ్బందికి అర్థంగాక.. వెంటనే ఆమె దగ్గరకు పరుగులు తీశారు.  అంతే  అందరు ఒక్కసారి  ఒక ఫేయింటింగ్  వైపు చూసి .. ఆశ్చర్యతో  నవ్వుకుంటూ  అక్కడి నుండి వెళ్లిపోయారు.

Samantha-Gift-02

కానీ సమంతాలో మాత్రం ఆ వణుకు, ఆ భయం అస్సలు తగ్గలేదు.  ఇంతకీ అభిమాని ఇచ్చింది ఏమిటో  తెలుసా సమంత  ఫెయిటింగ్ పోటేనే? కాకపోతే కొంచెం.. డిఫరెంట్ గా ఉంది.  సమంతా ఇప్పుడు  అందంగా ఉంది. కానీ  50 సంవత్సరాల తరువాత సమంతా ఎలా ఉంటుందో  ముందే ఊహించి  అభిమాని వేసి పేయింటింగ్  తో  సమంతా షాక్ తిన్నది. ఎవరి ఫోటోలను వారు చూసుకుంటే భయపడతారా ? ఎందుకంటే ఆ అభిమాని ఇచ్చిన పెయింటింగ్ సమంత 50 ఏళ్ల వయసులో ఎలా ఉంటుందో ఊహిస్తూ వేసిన చిత్రం. దీంతో అమ్మడు భయపడి… వెంటనే ఆ పెయింటింగ్ ని పారేసినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అలా సమంతా అభిమాని ఇచ్చిన పెయింటింగ్ ను  పారేయటంతో.. కొంతమంది అభిమానులు మండిపడుతున్నారు.

సమంతా కు బహుమతి ఇచ్చిన అభిమాని మాత్రం  ఆమె  ఇచ్చిన కౌగిలింతో.. హాయిగా  పాటలు పాడుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు.  సమంతకు మాత్రం ఆరోజు నుంచి రాత్రి  సమయంలో  ఆమె 50 ఏళ్ల వయసు ఫోటో గుర్తుకు వచ్చి పదే పదే భయంతో వణిపోయినట్లు  ఆమె సన్నిహితుల  చెబుతున్నారు.  ఏమైన ఒక అభిమాని  ప్రేమతో  ఇచ్చిన గిప్ట్ అలా పారేయటం చాలా తప్పుని  సమంతాకు..కోలీవుడ్  ప్రెండ్స్ క్లాసులు పీకుతున్నారు. 

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more