Pawan kalyan new conditions in tollywood producers

pawan kalyan new conditions, pawan kalyan new conditions in tollywood, pawan new conditions in tollywood producers, Tollywood cine actor Pawan Kalyan.

pawan kalyan new conditions in tollywood producers

పవన్ పెట్టిన కొత్త కండిషన్స్ ఇవే

Posted: 06/18/2014 09:33 AM IST
Pawan kalyan new conditions in tollywood producers

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. నిన్నటి వరకు రాజకీయాలతో సతమతమైన పవన్ కళ్యాణ్ .. ప్పుడు తనను నమ్ముకున్న నిర్మాతలకు, దర్శకులకు అందుబాటులో ఉండి, సినిమా షూటింగులు పూర్తి చేస్తున్నారు.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ .. టాలీవుడ్ నిర్మాతలకు, దర్శకులకు కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ , పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమా గోపాల.. గోపాల. బాలీవుడ్ సినిమా ఓ మైగాడ్ రీమేక్- గా వస్తోన్న ఈ సినిమాలో పవన్ కృష్ణుని పాత్రలో చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే పవర్ స్టార్ గోపాల… గోపాల మూవీ ప్రొడ్యూసర్- కి కండిషన్స్ పెట్టినట్లు టాలీవుడ్ టాక్. కేవలం మూడు వారాల మాత్రమే సమయం కేటాయిస్తానని ఆ తర్వాత అరచి గోల చేసినా నో డేట్స్ అని ఖరా ఖండిగా చెప్పినట్లు ఫిలింనగర్ వాసులు అంటున్నారు.

అంతేకాకుండా కేవలం 20 రోజుల్లోనే సినిమాలో తన సన్నివేశాలను పూర్తి చేయాలని అల్టిమేటం ఇచ్చినట్లు చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. పవన్ ఎప్పుడు ఇలాంటి కండిషన్స్ పెట్టలేదు కదా అని ఆరా తీస్తే.. అసలే విషయం బయట పడింది. గతంలో మాదిరి సైలెంట్ గా ఉంటే. అందరికి న్యాయం చేయటం చాలా కష్టంగా ఉ ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

pawan-tollywood-producers

అంటే పవన్ కళ్యాణ్ నమ్ముకొని చాలా దర్శకులు, నిర్మాతలు క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ ఇంత తొందరపడటానికి కారణం గబ్బర్-సింగ్ 2 షూటింగ్-లో పాల్గొని వారికి న్యాయం చేయాలని ఉద్దేశంలో పవన్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం తెలుసుకున్న సదరు నిర్మాతలు , దర్శకులు .. రిలాక్స్ అయ్యి, ఎంతైన .పవన్ కళ్యాణ్ ఈజ్ గ్రేట్..అంటూ..త్వరగా తమ షూటింగ్ పనులు చేసుకోవటంలో బిజీబిజీ గా మారిపోయారు.

పవన్ తనను నమ్ముకున్న వారికి వంద శాతం న్యాయం చేస్తాడని .. మరోసారి నిరూపించాడని ..టాలీవుడ్ పెద్దలు బహిరంగంగానే అంటున్నారు. ఒక సినిమా షూటింగ్ చేసి .. వందరోజులు విశ్రాంతి తీసుకుంటున్ననటులు ఉన్న ఈ రోజుల్లో..పవన్ లాంటి నటుడు ఉండటం టాలీవుడ్ దర్శకుల, నిర్మాతల అదృష్టంమని చిత్రపురి కాలనీ వాసులు అంటున్నారు.

అంటే పవన్ పెట్టిన కండిషన్స్ వల్ల .. పవన్ ఎలాంటి ఉపయోగం లేదు. కానీ తొటి వారి పరిస్థితి అర్థం చేసుకొని తప్పని పరిస్థితుల్లో ఇలాంటి కండిషన్స్ పెట్టవలసి వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏమైన పవన్ కళ్యాణ్ స్టైలే వేరు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more