నటుడు ప్రభాస్ పై టాలీవుడ్ లో అనేక రకాలు పుకార్లు వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమా మొదలైన రోజు నుండి ప్రభాస్ పై రకరకాల ప్రచారం జరుగుతుంది. ఇటీవల టాలీవుడ్ ఒక భయంకరమైన పుకారు హల్ చల్ చేస్తుంది. ప్రభాస్ పై పొలిటికల్ లీడర్ ఆటాక్ జరిగిందని ఆ సమయంలో ప్రభాస్ కు గాయం అయ్యిందని ఫిలింనగర్ వాసులు చెవులు కొరుక్కుంటున్నారు.
అయితే ఆ ప్రచారం సంగతేమో కానీ ప్రభాస్ కు తాజాగా భుజానికి ఓ సర్జరీ అయింది. సర్జరీ విషయాన్నీ రాజమౌళితో పాటు ప్రభాస్ కూడా ఒప్పుకున్నారు. దీంతో టాలీవుడ్ సర్కిల్ లో నడుస్తున్న పుకార్లు బలం దొరికింది. ప్రభాస్ కు గత కొంత కాలంగా షోల్డర్ చాలా ఇబ్బంది పెడుతోందని అందుకే.. భుజానికి సంబంధించిన శ్రస్త్ర చికిత్స చేయించుకున్నాడని.. ఇప్పుడు ప్రభాస్ ఫైన్ గా ఉన్నాడని, మరో నెల రోజుల్లో షూటింగ్ లో పాల్గొంటాడని యూనిట్ ప్రకటించింది. అయితే కొంతమంది అసలు అది పాత సమస్యకు చేసిన సర్జరీనేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు వాస్తవానికి ప్రభాస్ కు జరిగింది సర్జరీ కాదని అటాక్ అని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఒక మహిళకు సంబంధించిన విషయంలో ఓ రాజకీయ పార్టీ అధినేత, ఆయనకు సంబంధించిన రౌడీ బ్యాచ్ ప్రభాస్ మీద అటాక్ చేసినట్లుగా చెబుతున్నారు. అది కూడా సిటీలోని ఓ పబ్ లో ఈ ఎటాక్ జరిగిందని.. ఆ ఎటాక్ ను ఎదుర్కోవడంతోనే ప్రభాస్ భుజానికి ఈ గాయమైందని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
అయితే అసలు ఏం జరిగిందనేది .. అంత ఆ పేరుమాళ్ళకే తెలియాలి. ఈ పుకార్ల పై ప్రభాస్ మాట్లాడితే గానీ అసలు నిజం బయటపడదని ఆయన అభిమానులు అంటున్నారు. బాహుబలి సినిమా రిలీజ్ నాటికి అన్ని బయటకు వస్తాయని ఫిలింనగర్ ప్రజలు అంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more