పాపం... బబ్లీ బ్యూటీ హన్సికకు అన్ని కష్టాలే వచ్చి పడుతున్నాయి. అసలే ప్రేమలో ఫెయిల్ అయ్యిన బాధలో ఉంటే, తాను ఇటీవలి కాలంలో నటించిన సినిమాలు ఆశించినంత విజయాన్ని సొంతం చేసుకొక పోవడం మరింత డిప్రెషన్ లోకి కూరుకుపోన హన్సికను ప్రశాంతంగా ఉండనీయకుండా బజారుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు తమిళ దర్శక నిర్మాతలు.
ఈ అమ్మడు తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శింబుతో కలిసి ‘వాలు ’ అనే సినిమాకు కమీట్ అయ్యిన హన్సిక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య బ్రేకప్ రావడంతో , అప్పటి నుండి ఈ సినిమా షూటింగ్‌కి హాజరు కావడం లేదని... ఆ చిత్ర నిర్మాతలు తమిళ చలన చిత్ర వాణిజ్య మండలికి ఫిర్యాదు చేశారు. దీని పై హన్సిక కాస్త ఘాటుగానే స్పందించింది. ఎన్నిసార్లు డేట్లు ఇమ్మంటారు..?? ఒప్పందం ప్రకారం అనుకొన్న కాల్షీట్లను ఇచ్చాను. అదనంగా అడిగినప్పుడు మళ్లీ ఇచ్చా.
ఇప్పుడు మళ్లీ మళ్లీ అడుగుతున్నారు. నా పని నేను సక్రమంగా చేశా. అయినా నన్ను బజారుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. కావాలని నా పరువుకు భంగం కలిగించే పనులు చేస్తుంటే నేను ఊరుకోను హెచ్చరించినంత పని చేసింది. కానీ ఆమె స్నేహితులు, సన్నిహితులు మాత్రం ఎవరితో పెట్టుకున్నా, దర్శక, నిర్మాతలతో మాత్రం పెట్టుకోకని సలహాలు ఇస్తున్నా వారి మాటను పట్టించుకోవడం లేదు.
కానీ వ్యవహారం వెనుక శింబు హస్తం ఉండే ఉంటుందని, తన ప్రేమను కాదన్నందుకే ఇలా బజారుకు లాగేందుకు తమిళ దర్శక, నిర్మాతలతో ఫిర్యాదు చేయిస్తున్నాడనే అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. చూద్దాం ముందు ముందు ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more