Arjun kapoor relation not with alia but with arpita khan

Arjun Kapoor relation not with Alia but with Arpita Khan, Salman Khan sister Arpita Khan, Arjun Kapoor in 2 States movie, Arjun Kapoor and Alia Bhatt

Arjun Kapoor relation not with Alia but with Arpita Khan

ప్రియురాలు ఆలియా కాదు సల్మాన్ చెల్లి అర్పిత!

Posted: 04/10/2014 01:49 PM IST
Arjun kapoor relation not with alia but with arpita khan

2 స్టేట్స్ చిత్రంలో హీరో అర్జున్ కపూర్, ఆ చిత్రంలో హీరోయిన్ ల మధ్య ప్రేమాయణం గురించి కథకథలుగా చెప్పుకుంటుంటే, నా మొట్ట మొదటి ప్రేమ సంబంధం కేవలం సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత ఖాన్ తోనేనని అర్జున్ కపూర్ ప్రకటించాడు. 

అయితే అది కూడా ఇప్పుడు కాదట.  తను ఇంకా చిన్న వయసులో యవ్వనంలో అడుగుపెట్టి ఉన్నప్పుడు అర్పిత తో రెండు సంవత్సరాలు ప్రేమ సంబంధం ఉండేదని అన్నాడు అర్జున్ కపూర్.  అర్జున్ కపూర్ కి అప్పుడు 18 సంవత్సరాల వయసే ఉండటం వలన ఈ విషయాన్ని సల్మాన్ కి చెప్పటానికి భయపడ్డానని, కానీ ధైర్యం చేసి అతనికి అతని కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పానని అన్నాడు. 

సల్మాన్ అర్జున్ ని ఆదరించటమే కాక, ఒక పెద్దన్నలా వ్యవహరించాడట.  అర్పితతో సంబంధం తెగిపోయిన తర్వాత కూడా ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉన్న తనకు సలహాలనిచ్చాడట.  ఆ సమయంలో 140 కిలోల బరువున్న అర్జున్ కపూర్ కి సినిమాల మీద ఉన్న ఇష్టాన్ని గ్రహించి ఆ బరువంతా తగ్గిపోయి సినిమాలలో అవకాశాలకోసం కృషి చెయ్యటానికి తగినంత ప్రోత్సాహం ఇచ్చాడని చెప్పుకుంటున్నాడు అర్జున్ కపూర్. 

తనకి తండ్రి, పెద్దన్న లోటుని సల్మాన్ ఖాన్ తీర్చాడని చెప్తున్నాడు అర్జున్ కపూర్.  అయితే ఆలియా భట్ తో కానీ ప్రస్తుతం తన పాత ప్రియురాలితో కానీ ఎటువంటి సంబంధమూ లేదని చెప్తున్న అర్జున్ కపూర్ కొత్త పరిచయాలకోసం వెంపర్లాడుతున్నాడని అందుకే ప్రస్తుతం హృదయంలో కావలసినంత ఖాళీ ఉందని చెప్పుకుంటున్నాడని అనుకుంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more