Movie release without consulting its director

Movie release without consulting its director, Anamika Telugu movie, Nayantara, Kahani Hindi movie, Vidya Balan

Movie release without consulting its director

దర్శకుడికి చెప్పా పెట్టకుండా సినిమా రిలీజ్

Posted: 04/10/2014 09:43 AM IST
Movie release without consulting its director

పురాణాల్లో, ఎవరు నువ్వు అంటే, నేను మీ కుమారుడిని నాన్నగారూ అని కుర్రవాడు బదులిచ్చినట్లుగా, లేదా పెద్దలు కానీ భార్య కానీ చెప్పినట్లుగా, శేఖర్ కమ్ముల రూపొందించిన అనామికా చిత్రం విడుదలవుతున్నట్లుగా ఆయనకే తెలియదట.  అందరిలాగానే వార్తాపత్రికలలో చూసి తెలుసుకున్నారటాయన.

విడుదల చేస్తున్నామని అతనికి చెప్పటం కాదు నిజానికి దర్శకుడి సలహాతోనే నిర్మాతలు విడుదల తేదీని నిర్ణయించుకుంటారు. కానీ ఎండమోల్ సిని నిర్మాణ సంస్థ ఆ ఆనవాయితీలను పక్కకు పెట్టి, దర్శకుడి మీద తమకున్న నిరసనను ప్రదర్శించినట్లుగా కనపడుతోంది. 

ఇది అనైతికమంటూ సినీ దర్శకులు ఖండించారు.  దర్శకుడి పాత్ర కేవలం దర్శకత్వం వరకే కాకుండా మన రాష్ట్రంలో ఆ సినిమాకి విజయం సాధించటం వరకు ఉంటుంది.  అంటే ఇతర సినిమాల విడుదల దృష్ట్యా ఈ సినిమా విడుదలకు సరైన తేదీని నిర్ణయించటం, ప్రచారం, ప్రోమోలు, ఇంటర్వ్యూలు, విజయోత్సవాలు, ఇలా అన్నిటిలోనూ దర్శకుడు ప్రధాన పాత్రను వహించటం ఆనవాయితీ. 

కానీ వాటిని పట్టించుకోకుండా దర్శకుడికి ఇవ్వవలసిన ప్రాధాన్యతనివ్వకుండా ఒంటెద్దు పోకడతో ముందుకెళ్తున్న సినీ నిర్మాణ సంస్థను పలువురు తప్పుపడుతున్నారు.  అయితే శేఖర్ కమ్ముల ఈ విషయంలో అందుకు ప్రతికూలంగా ఎటువంటి వ్యాఖ్యానమూ చెయ్యలేదు. 

విద్యాబాలన్ ముఖ్యపాత్రలో నటించిన హిందీ సినిమా కహానీకి తెలుగు పునర్నిర్మాణమే అనామికా.  ఇందులో నయనతార ప్రధాన భూమికను నిర్వహించారు. 

ఈ చిత్రం కీరవాణి సంగీత దర్శకత్వంలో తెలుగు తమిళ్ భాషల్లో రూపొందింది.  ప్రఖ్యాత నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమాకి సంభాషణలను రాసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more