పవన్ కళ్యాణ్ అనే పవర్ ఇప్పుడు పొలిటికల్ వైపు అడుగులు వేస్తుంది. తన పవన్ ఏమిటో చూపించటానికి పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి అడుగుపెడుతున్నారు. అవినీతి రాజకీయ నాయకులతో విసిగిపోయిన ఉన్న ప్రజలకు స్వచ్చమైన మెలిమి బంగారం లాంటి ఆరడుగుల నాయకుడు ప్రజా సేవా చేయటానికి కంకణం కట్టుకున్నాడు. ఇప్పటికే పవన్ కల్యాణ్ రాజకీయ రంగంలో వడి వడిగా అడుగులు వేస్తున్నాడు. పవన్ పార్టీ పెట్టడం ఖాయమనేది విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ..పార్టీ పెట్టకపోయిన.. మాత్రం 2014 ఎన్నికల్లో రెండు ప్రాంతాల నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేయటానికి రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇందు కోసం పవన్ కళ్యాణ్ ఒక బుక్ ను రాసినట్లు తెలుస్తోంది.
ఈ పుస్తకంలో ప్రస్తుత రాజకీయాలపై తనకున్న అవగాహన, అభిప్రాయాలను నిశితంగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు ఎలా ఉండాలి? సామాన్యుల జీవితాలతను ఎలా బాగు చేయాలి. అసలు ఈ సమాజంలో ఉన్న సమస్యలేంటి? వాటికి పరిష్కార మార్గాలేంటి? ఇలాంటి విషయాలపై తన అభిప్రాయాలను ఆ పుస్తకంలో రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
పవన్ పార్టీ పెట్టిన రోజే.. ఈ పుస్తకాన్ని విడుదల చేస్తారని తెలుస్తోంది. మరి ఆ పుస్తకంలో పవన్ ఎలాంటి అభిప్రాయాలను వ్యక్త పరిచాడో..? తన అక్షరాలతో ఎలా ప్రభావితం చేస్తాడో..? అని అభిమాను ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక రాజకీయ నాయకులైతే టెన్షన్ తో బిపీ పెరిగి.. టాబ్లెట్స్ మింగుతున్నారు. ఇప్పుడు అందరి కళ్లు 12 తేదీ పైనే ఉన్నాయి.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more