దారి తప్పిన సమంతా .. ఎక్కడో దారితప్పి పోలేదు గానీ, తన సినీ జీవితంలో ..ఇప్పటి వరకు వేసిన గ్లామర్ పాత్రలకు, కొంచెం మాసాల దట్టిస్తుంది. అంటే ఇప్పటి వరకు పాత సినిమాల్లో సావిత్రి మాదిరి ఒండినిండా బట్టలతో కనిపించి మాయ చేసిన ఈ చెన్నై మాయలేడి .. ఇక నుండి తన మాసాల ఉన్న పాత్రల వైపు మొగ్గు చూపుతుంది.అంటే సమంతా గ్లామర్ పాత్రల విషయంలో తన పంథాను మార్చుకుంటోందా అంటే తమిళ చిత్ర వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.
ఏమాయ చేసావే సినిమా నుంచి నిన్నటి అత్తారింటికి దారేది సినిమా వరకు గ్లామర్ విషయంలో కొన్ని హద్దులు పాటిస్తూ యువతరం కలల రాణిగా భాసిల్లుతున్న ఈ సుందరి తాజాగా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న అంజాన్ చిత్రంలో కొత్త అవతారంలో కనిపించబోతోందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
సమంతా ముంబై మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సూర్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడని చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రం కోసం ఇటీవలే ఓ పాటను హీరో హీరోయిన్‌లపై చిత్రీకరించారు. ఈ పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఈ సాంగ్ లో సమంతా కురచ దుస్తులు ధరించి పూర్తిగా కొత్త అవతారంలో కనిపించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముంబై, గోవాలో ఇప్పటి వరకు 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ముంబై విస్ట్‌లింగ్ వూడ్స్ క్యాంపస్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్టులో ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తిరుపతి బ్రదర్స్ సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటి వరకు సమంతా ఏమి చూపించకుండానే ..చేతినిండా సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఇలాంటి మాసాల దట్టిస్తే, టాలీవుడ్ ను, కోలీవుడ్ ను షేక్ చేసిన ఆశ్చర్యంలేదని ఆమె అభిమానులు అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more