టాలీవుడ్ బొమ్మాళి (అనుష్క) ఆశకు షాక్ తగిలింది. టాలీవుడ్ లో తన హావా చాటుతున్నప్పుటికి, కోలీవుడ్ తెరపై కూడా ఒక వెలుగు వేలగాలని బొమ్మాళి కలలు కంటుంది. తన జీవితం కల నేరవేరే సమయం రావటంతో.. అనుష్క ఆనందానికి హద్దులేకుండా పోయింది. తమిళ హీరో అజిత్ తో అనుష్క ఒక ఛాన్స్ దొరికింది.
ఇక ఛాన్స్ దొరికింది కాబట్టి, అజిత్ తో రొమాన్స్ పై బొమ్మాళి ఆశలు పెంచుకుంది. కానీ తొలిసారిగా అజిత్‌తో జత కడదామనుకున్న బొమ్మాళి ఆశకు బ్రేక్ పడింది. ఎంపిక చేసినట్టే చేసి అజిత్ చిత్రం నుంచి తప్పించారనే వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
.తమిళంలో విజయ్, విక్రం, సూర్య సరసన నటించి మెప్పించింది. అజిత్‌కు జంటగా నటించే అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చింది. అమ్మడు ఆనందాన్ని పంచుతూ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
ఆరంభం, వీరం వంటి సూపర్‌డూపర్ హిట్‌ల తరువాత అజిత్ నటిస్తున్న చిత్రం కావడంతో అనుష్క ఆనందానికి హద్దులు లేవు. ఈ సినిమా చిత్రీకరణకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు బొమ్మాళికి షాకిచ్చినట్లు కోలీవుడ్ సమాచారం.
సినిమా నుంచి ఆమెను తప్పించి ముంబై మోడళ్ళకోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దీంతో అనుష్క తీవ్ర నిరాశకు గురైందని ఆమెసన్నిహితులు అంటున్నారు. ఈ అమ్మడు బొద్దుగా మారండంతోనే ఈ సినిమా నుంచి తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీదం అనుష్క బరువు పెరిగిందనే కారణంతోనే.. బొమ్మాళి ఆశలపై దర్శకుడు నీళ్లుపోసాడని..కోలీవుడ్ లో ఆమె అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more