Nadhiya high speed in movies

nadhiya, Actress Nadhiya, nadhiya high speed in movies, producers, Nadhiya movies, pawan kalyan and nadhiya.

nadhiya high speed in movies

నదియా స్పీడ్ కు చుక్కలు చూస్తున్న నిర్మాతలు

Posted: 02/24/2014 11:39 AM IST
Nadhiya high speed in movies

గతంలో గ్లామర్ హీరోయిన్ గా  దుమ్మురేపిన ఆలనాటి నటి, నేటి అత్త  నదియా, అప్పుడు, ఇప్పుడు వెండితెరపై చెలరేగిపోతుంది. అప్పుడు తన అందంతో,  హీరో అర్జున్  లాంటి వారి మనసును దోచుకుందనే వార్తలు కోలీవుడ్ లో వినిపించాయి.  అయితే  ఇద్దరు బిడ్డల తల్లిగా  కాపురం చేసుకుంటూ  హాయిగా ఉన్న నదియా తన సెకండ్  ఇన్నింగ్స్  మొదలుపెట్టిన విషయం  తెలిసిందే. 

సహజంగా  సెకండ్ ఇన్నింగ్స్ చేసిన  సీనియర్ నటిమణులకు అంతగా గుర్తింపు రాదు. కానీ  నదియాకు మాత్రం అలా కాదు. తన నటించిన ప్రతి సినిమాలో నదియా ప్రత్యేకంగా ప్రక్షకులను ఆకట్టుకుంది.  ప్రభాస్ నటించిన మిర్చిలో  అమ్మగా పరిచయం అయ్యింది. కానీ  పవన్ కళ్యాణ్  నటించిన  అత్తారింటికి దారేది సినిమాలో  అత్త గా నటించి తన ఇమేజ్ ను రెండింతలు రెట్టింపు చేసుకుంది నదియా. 

ఇప్పుడు నదియా కోసం  ప్రతి సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను పెడుతున్నట్లు టాలీవుడ్ వాసులు అంటున్నారు.   అంతేకాకుండా నదియా కు ఆఫర్ల మీద ఆపర్లు వస్తున్నాయి.  పైగా కథలో ప్రాధాన్యం వున్న పాత్రలే రావటం నదియా అధ్రుష్టం అని ఆమె అభిమానులు అంటున్నారు. మొత్తం మీద నదియా  స్పీడు పెంచినట్లు తెలుస్తోంది.   

ప్రస్తుతం నదియా ప్రస్తుతం 'ఆగడు' సినిమాలో మహేష్ బాబుకి అక్కగా, 'దృశ్యం' తెలుగు రీమేక్ లో పోలీసాఫీసర్ గా,

'దృశ్యం' తమిళ వెర్షన్లో కమల్ సరసన కథానాయికగా, ఓ మళయాళ సినిమాలో కీలక పాత్రదారిగా,ఎన్టీఆర్ నటించనున్న సినిమాలో మరో ముఖ్య పాత్రలో ... ఇలా చేతినిండా సినిమాలతో, ఎవరూ ఊహించనంతగా బిజీ బిజీగా నదియా దూసుకుపోతుందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు.  

అయితే  నదియా పారితోషికం విషయంలో నిర్మాతలకు చుక్కలు కనబడుతున్నాయని  టాలీవుడ్ నిర్మాతల సంఘం అంటుంది.   అంతే మరీ  నదియా డిమాండ్ అలా ఉందని  ఆమె అభిమానులు అంటున్నారు.  నదియా కూడా   డిమాండ్  ఉన్నప్పుడే  నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more