టాలీవుడ్ నటుడు నాని. ఇటీవల మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు నానిదే. బాలీవుడ్ నటి వాణి కపూర్ తో నటించిన ఆహా కళ్యాణం సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. అసలే పెళ్లైన యువ నటుడు కావటం, అంది వచ్చిన ప్రతి అకశాన్ని నాని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆహా కళ్యాణం, బాలీవుడ్ లో హిట్ సాధించిన బ్యాండ్ బాజా బారాత్ కు రీమేక్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్ ప్రతిష్టాత్మకంగా మొదటిసారి మ సౌత్ తెరపైకి అడుగు పెట్టారు.
అయితే ఈ సినిమా కు కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటి చేయటం జరిగింది. ఆహా కళ్యాణం హీరోయిన్ వాణికపూర్ సినిమా విషయాలు మాట్లాడుతూ.. నటుడు నానితో నాకు ఎఫైర్ ఉందని మీడియాతో చెప్పటమే ఆహా కళ్యాణం పై అందరు ఆశలు పెంచుకున్నారు. అంతేకాకుండా.. నానితో నా లిప్ లాక్ చాలా బాగుంటుందని మీడియా ముందు రొమాన్స్ ను పెంచి మాట్లాడటంతో.. అందరు నాని కళ్యాణం పై ఆశలు పెంచుకున్నారు.
ఈరోజు ఆహా కళ్యాణం విడుదలైంది. అయితే థియేటర్ల వద్ద సందడి అంతగా కనిపించలేదని సినీజనాలు అంటున్నారు. మామూలుగా అయితే నాని హీరోగా నటించిన సినిమాకుల ఓక మోస్తరు ఓపెనింగ్స్ రావడం ఖాయం. కానీ ఈరోజు నాని కళ్యాణం వద్ద అభిమానుల, ప్రేక్షకుల సందడి, హడావుడి ఏమీ కనిపించలేదని మీడియా వర్గాలు అంటున్నాయి.
ఈ సినిమాకు ఇలా జరగటానికి కారణం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలే అని సినీజనాలు అంటున్నారు. తెలంగాణ వచ్చిన ఆనందంలో తెలంగాణ ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. ఆంద్రప్రదేశ్ విడిపోయిందనే బాధలో సీమాంద్ర ప్రజలు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.
అంతేకాకుండా రాష్ట్రంలో.. పరీక్షల సమయం దగ్గరపడటంతో ..విద్యార్థులు.. సినిమా థియేటర్లకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈరోజు నాని కళ్యాణం వద్ద పెద్దగా సందడి లేదని ఫిలింనగర్ వాసులు అంటున్నారు.
అయితే ఆహా కళ్యాణం సినిమా చూసిన వారు మాత్రం, సినిమా చాలా బాగుందని, నాని , వాణి కపూర్ రొమాన్స్ సన్నివేశాలు చాలా అద్బుతంగా ఉన్నాయని సినిమా చూసిన సినీజనాలు అంటున్నారు. సినిమా మొత్తం కామెడీగా ఉందని, సినిమా చూస్తున్నంత సేపు మనసు హాయిగా ఉందని నాని కళ్యాణం తెరపై చూసిన వారు అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more