టాలీవుడ్ లో హీరోగా నాని మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. రెండు మూడు హిట్ చిత్రాల్లో నటించి మంచి రేసులో దూసుకుపోతున్న నాని ‘పైసా ’ చిత్రంలో నటించినా అది ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం జెండా పై కపిరాజు చిత్రంలో నటిస్తున్న నానికి పైసల పై ఆశ పుట్టి ప్రేక్షకుల నుండి దోపిడీ చేయాలని భావించి ‘డీ ఫర్ దోపిడి ’ సినిమా చూసి టెంప్ట్ అయి పోయి అందులో కొంత పెట్టుబడి పెట్టాడు.
పెట్టిన పెట్టబడి రాబట్టుకోవడానికి ఎలాగు ఖాళీగానే ఉంటున్నాడు గనుక ఈ సినిమాకు ప్రమోషన్ కూడా చేసి కాస్తంత ప్రచారం కల్పించాడు. ఈయనకు తోడు దిల్ రాజు కూడా ఓ చెయ్యివేసి జనాలను దోచుకోవాలనుకున్నారు. కానీ వీరి వ్యూహం బెడిసి కొట్టింది. సినిమాకు కల్పించిన ప్రచారానికి ఓపెనింగులు ఓ మోస్తరుగా వచ్చినా, సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు నానికి పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
వీరు జనాల నుండి దోచుకోవాలనుకున్న పైసల్ని ఉయ్యాలా... జంపాలా... సినిమా దోచుకుంటుంది. దీంతో నాని అత్యాశకు పోతే ఇలానే ఉంటుందని లోలోన మథన పడుతున్నాడట. ఇవే పైసల్ని ‘పైసా ’ సినిమాకు పెట్టి దాన్ని విడుదల చేసుకున్నా బాగుండేది కదా అని ఆయన సన్నిహితులు హితబోధ చేస్తున్నాడట.
రెండింటికి చెడ్డ రేవడి లాగా నాని నిర్మాతగా మారిన మొదటి సినిమానే దెబ్బకొట్టడంతో మరో సినిమాకు పెట్టుబడి పెట్టడానికి సాహసం చేస్తాడంటారా ?
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more