టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి 2013 సంవత్సరం అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి. తాను ఎన్నో ఆశలతో బాలీవుడ్ లో అడుగు పెట్టి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ చిత్రం ‘జంజీర్ ’ చిత్రాన్ని రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఎంతో ఘన విజయం సాధిస్తుందనుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టడమే కాకుండా, అతనికి బాలీవుడ్ డెబ్యూట్ మూవీ ఓ పీడకలలా మిగిలిపోయింది.
అంతే కాకుండా బాలీవుడ్ లో 2013 సంవత్సరానికి గాను బిగ్గెస్ట్ ‘అట్టర్ ప్లాప్ ’ చిత్రంగా మొదటి స్థానంలో ఉంది. సినిమా డిజాస్టర్ అయినా పెద్దగా ఫీలవ్వని రామ్ చరణ్ ఇప్పుడు మాత్రం తెగ ఫీలవుతున్నాడట. కారణం ఏంటంటే ఈ చిత్రంలో చరణ్ సరసన నటించిన ప్రియాంక చోప్రా ఇతని పై ఫైర్ అవ్వడమే. ప్రియాంక చోప్రా జంజీర్ సినిమాతో 2013 ‘అట్టర్ ఫ్లాప్ హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ ’ గా మారింది.
ఇప్పుడు ప్రియాంక పేరు ముందు ఈ టైటిల్ కూడా చేర్చి కొన్ని రాతలు రాస్తోందట బాలీవుడ్ మీడియా.. దీంతో ఇదంతా చరణ్ వల్లే అంటూ ఫీలైపోతోందట. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరున్న ప్రియాంక చెత్త హీరోయిన్ గా పేరు రావడంతో 2013 సంవత్సరం ఓ బ్యాడ్ ఇయర్ గా ఫీలవుతుందని అంటున్నారు.
అయినా చరణ్ ఏం చేశాడని... కాసులకు కక్కుర్తి పడకుండా అప్పుడే చేయనని చెబితే వేరే వాళ్ళని చూసుకునే వారు కదా ? అని ఆయన అభిమానులు సెటైర్స్ వేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more