Digvijay singh deadline to kcr

digvijay singh, kcr trs party merger, kcr hadpromised trsmerger, digvijay singh deadline to kcr, digvijay singh - kcr, telangana issue, teangana jac, t-jac leaders meet on digviyansingh, 2014 election, congress party, telangana bill, trs leaders, political news, latest telugu news, breaking news, ap political news

digvijay singh deadline to kcr

కేసిఆర్ కు డెడ్ లైన్ పెట్టిన డీగ్గీరాజా?

Posted: 12/14/2013 12:25 PM IST
Digvijay singh deadline to kcr

తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకంట్ల చంద్రశేఖరరావు కు రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ దిగ్విజయ్ సింగ్ డెడ్ లైన్ , వార్నింగ్ ఒకేసారి ఇవ్వటం జరిగిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గత రెండు రోజుల నుండి దిగ్విజయ్ సింగ్ నగరంలో హల్ చల్ చేయటం జరిగింది. తెలంగాణ బిల్లు పై రాష్ట్ర రాజకీయ నాయకులతో చర్చలు, సమావేశాలు జరిపి, కాంగ్రెస్ నాయకులకు కొన్ని సలహాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణ జేఏసీ నేతలతో కూడా దిగ్విజయ్ సింగ్ భేటి కావటంతో టీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలైంది. తెలంగాణ జేఏసీ నేతలకు దిగ్విజయ్ సింగ్ బంఫర్ ఆఫర్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

 

ఇలా తెలంగాణ జేఏసీ నేతలతో దిగ్విజయ్ సింగ్ మంతనాలు జరపటం వెనుక కేసిఆర్ కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ ఎలాగు వస్తుంది కాబట్టి, ఇక మిగిలింది టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటమే. కేసిఆర్ ఆ పనిని ఎంత త్వరగా చేస్తే.. అంత మంచిదని కొంతమంది టీఆర్ఎస్ నేతలతో దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఒక వేళ కేసిఆర్ తోక జాడిస్తే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుందని దిగ్విజయ్ సింగ్ టీఆర్ఎస్ నేతలను హెచ్చరించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేసిఆర్ పై నమ్మకం లేకపోవటంతో.. తెలంగాణ జేఏసి నేతలను రంగంలోకి దించుతున్నమని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జేఏసీ నేతలకు టిక్కెట్లు ఇచ్చి పోటీ చేయిస్తామని దిగ్విజయ్ సింగ్ టీఆర్ఎస్ నేతలతో చెప్పినట్లు సమాచారం.

 

దీంతో టీఆర్ఎస్ నేతల్లో కొత్త భయం పట్టుకుంది. తెలంగాణ జేఏసీ లేనిదే.. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు రావనే విషయం ఆ నేతలకు తెలిసిందే. అంతేకాకుండా తెలంగాణ జేఏసీ నేతలకు కూడా ఒక రాజకీయ పార్టీని పెట్టేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే కేసిఆర్ కు ఈ విషయం తెలుసుకోని, నిన్న ఒక పెళ్లి ఫంక్షన్ వద్ద రాజకీయ ప్రకటనలు చేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే.. తెలంగాణ ఉద్యోగులకు భారీ జీతాలు ఇస్తానని ప్రకటన చేయటమే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ఉద్యోగుల ఓట్ల పై కేసిఆర్ ముందుగానే కర్చీఫ్ వేయటం జరిగిందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తం మీద దిగ్విజయ్ సింగ్ , ఎప్పుడు డెడ్ లైన్లు పెట్టే కేసిఆర్ కే డెడ్ లైన్ పెట్టి వెళ్లాడని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

 

ఇక కేసిఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో ఎప్పుడు విలీనం చేస్తాడోనని కాంగ్రెస్ నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ కేసిఆర్ మాట్లాడుతూ.. పార్టీని విలీనం చేయటం అంటే .. జేబులో పెన్ను కాదు.. అడిగిన వెంటనే తీసి ఇవ్వటానికి వేటకారంగా మాట్లాడిన విషయం తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చెయ్యకపోతే.. రాబోయే ఎన్నికల్లో మాత్రం చావు దెబ్బ కొట్టానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుందనే విషయం టీఆర్ఎస్ నాయకులకు బాగా అర్థమైంది. దీంతో కేసిఆర్ పై ఒత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్ నాయకులు సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ కబంధ కౌగిలి నుండి కేసిఆర్ ఎలా తప్పించుకుంటాడో చూద్దాం

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more