ప్రేయసి, భార్య, అక్క, చెల్లి, స్నేహితురాలు, అమ్మ, అత్త... పాత్ర ఏదైనా దానికి ప్రాణం పోస్తారు మధుమణి. రుతురాగాలలో కావేరి పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారామె. ప్రస్తుతం శ్రావణి సుబ్రహ్మణ్యం, ఆహ్వానం సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో కూడా నటిస్తోన్న మధుమణి మనసులోని మాటలు...
మీ పుట్టు పూర్వోత్తరాలు?
పుట్టింది, పెరిగింది అంతా పార్వతీపురం (విజయనగరం)లో. నేను ఆరో తరగతిలో ఉండగా నాన్న యాక్సిడెంట్‌లో చనిపోయారు. అమ్మ ప్రభావతి టీచర్. తనే నన్ను, తమ్ముడిని కష్టపడి పెంచింది.
కెరీర్ ఎలా మొదలైంది?
ఇంటర్ అయ్యాక నాకు పెళ్లయ్యింది. ఆయన (జి.ఎస్.రావు) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. హైదరాబాద్‌లో కాపురం. ఓసారి బంధువు లొస్తే స్టూడియోలు చూద్దామని వెళ్లాం. పద్మాలయా స్టూడియోస్‌లో ఒకరు నన్ను చూసి మీరు ఆర్టిస్టా అనడిగారు. కాదంటే ఒక సీరియల్లో మంచి పాత్ర ఉంది, చేస్తారా అనడిగారు. ఆసక్తి లేకపోవడంతో ఆలోచనలో పడ్డాను. మావారు ప్రోత్సహించడంతో ఓకే అన్నాను. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి.
పెళ్లయ్యాక మొదలెట్టారు. ఇబ్బంది కాలేదా?
పెళ్లి మాత్రమేనా... ఇద్దరు పిల్లలు కూడా! బిజీ అయిపోవడంతో పిల్లల్ని చూడటం కష్టమయ్యేది. దాంతో అమ్మ వాళ్లను తీసుకెళ్లిపోయారు. మూడు నెలలకో, ఆరు నెలలకో వెళ్లి చూసి వచ్చే దాన్ని. వాళ్లు టెన్త్ పూర్తి చేసేవరకూ అంతే. అయితే పిల్లలు అమ్మ దగ్గర పెరగడం ఎంతో మంచిదయ్యింది. మాకు నేర్పినట్టే అమ్మ వాళ్లకు ఎంతో క్రమశిక్షణ నేర్పింది. అందుకు అమ్మకు థ్యాంక్స్ చెప్పాలి.బాగా సంతృప్తినిచ్చిన పాత్ర?ప్రాణం అనే షార్ట్‌ఫిల్మ్‌లో మంచి పాత్ర చేశాను. దర్శకుడిగా తాను నిరూపించు కోవడం కోసం, నటిగా నన్నో కొత్త షేడ్‌లో చూపించడం కోసమే నా ఫ్రెండ్ శ్యామ్‌సన్ దాన్ని తీశాడు. ఆ చిత్రం ఇటాలియన్, హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు తెచ్చిపెట్టింది. జోగిణి అనే రెండు గంటల సినిమా కూడా నటిగా ఎంతో తృప్తినిచ్చింది.
కావేరి పాత్ర మిమ్మల్నెలా వరించింది?
నా పెళ్ళికి రండి ‘ సీరియల్ చేస్తున్నప్పుడు మంజులానాయుడు ఆఫీసు నుంచి మెసేజ్ వచ్చింది, ఆవిడను కలవమని. వెళ్తే కావేరి పాత్ర గురించి చెప్పారు. గోళ్లు పెంచ కూడదు, హెయిర్ ట్రిమ్ చేయకూడదు అంటూ చెబుతుంటే ఏ పాత్ర అని అడిగా. పనిమనిషి... ఏం చేయవా అన్నారు. మంచి బ్యానర్, మంచి దర్శకురాలు... కాదని ఎలా అంటాను! అయితే తర్వాత తెలిసింది... అది హీరోయిన్ పాత్రేనని!మీ గురించి అందరికీ తెలిసింది అప్పుడేగా?అవును. అంతవరకూ మధుమణి అనే నటి ఉందని తెలిసినా, ఆమె ఎంత మంచి నటి అనేది తెలిసింది మాత్రం ‘రుతురాగాలు సీరియల్ ద్వారనే. ఆ క్రెడిట్ అంతా మంజులా నాయుడిదే. నటనంటే తెలియని వారిని కూడా గొప్ప ఆర్టిస్టుగా మలచగలరామె !
మీ సినిమాల సంగతులు చెప్పండి?
మొదట ఎస్వీ క్రిష్టారెడ్డి ఛాన్స్ ఇచ్చారు. తర్వాత చిలక్కొట్టుడు, ఫ్యామిలీ సర్కస్, సంతోషం, ఒకరికొకరు, అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్, ఈ రోజుల్లో... ఇలా చాలా చేశాను. మధ్యలో సీరియల్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఐదేళ్లు సినిమాలు చేయలేదు. శేఖర్ కమ్ముల గోదావరి ద్వారా మళ్లీ వచ్చాను.. ప్రస్తుతం ప్రభాస్ వారధి, నీ ప్రేమ కావాలి, లక్కీ తదితర సినిమాలు చేస్తున్నాను.
నటిగా మీ ప్లస్/మైనస్ పాయింట్స్ ఏమిటి?
ఇండస్ట్రీలో రాణించాలంటే నటన ఒక్కటే చాలదు. మంచి మాట, ప్రవర్తన కూడా ఉండాలి. నేను అందరితోనూ ప్రేమగా మాట్లాడతాను. లైట్‌బాయ్స్ అంతా నన్ను మమ్మీ అని పిలుస్తారంటే, నేనేంటో అర్థం చేసుకోవచ్చు. అదే నా ప్లస్. ఇక మైనస్ అంటే నా హైట్. మరో 3 అంగుళాలు ఉంటే బాగుండేది. ఐపీఎస్ ఆఫీసర్ లాంటి డైనమిక్ పాత్రలు చేయాలంటే పొట్టిగా ఉంటే కుదరదుగా !
డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా ?
ఈ ప్రశ్న ఏ నటిని అడిగినా , వసంత కోకిలలో లో శ్రీదేవి అని చెప్తారు. ఒకప్పుడు నేనూ అలాగే అనేదాన్ని. కానీ ఇప్పుడా అవకాశం లేదుగా. జాతీయ అవార్డు తెచ్చుకునే పాత్ర ఏదైనా దొరికితే చాలు.
భవిష్యత్ ప్రణాళికలు?
నిర్మలమ్మగారిలా ప్రాణమున్నంతవరకూ నటిస్తూనే ఉండాలి. ఉంటాను. ఒకవేళ అవకాశాలు కొరవడితే దర్శకురాలిగా మారతాను. మా అమ్మాయి మిమిష బీటెక్ చేస్తోంది. తన చిన్నప్పుడు నేను నెగిటివ్ రోల్స్ చేస్తే... స్కూల్లో అందరూ నన్ను అదోలా చూస్తున్నారు, నువ్వ లాంటివి చేయొద్దు అని గొడవ చేసేది. రాఖీ సినిమాలో నేను కోడల్ని కిరోసిన్ పోసి కాల్చేస్తాను. ఆ సీన్ చూసి తెగ తిట్టుకుంది. అది చేసింది నేనే కదా అంటే, నాకు ఎవరైనా ఒకటే అంది. తనకి ఈ ఫీల్డ్‌మీద ఇంటరెస్ట్ లేదు. తను ఓ నటి కూతుర్నని కూడా ఎక్కడా చెప్పుకోదు. ఇక మా బాబు సుజిత్ ఇంటర్ చదువుతున్నాడు. తన కి మాత్రం నటనంటే పిచ్చి. ఏం చేస్తాడో చూడాలి మరి !
(And get your daily news straight to your inbox)
Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి,... Read more
May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more
Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more
Mar 08 | సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more
Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more