LIE Movie Telugu Review and Rating

Teluguwishesh లై లై Nithiin LIE Movie Review and Rating. Complete Story and Synopsis. Product #: 84156 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    లై

  • బ్యానర్  :

    14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్

  • దర్శకుడు  :

    హను రాఘవపూడి

  • నిర్మాత  :

    రామ్ అచంట, గోపీచంద్ అచంట,

  • సంగీతం  :

    మణిశర్మ

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    యువరాజ్

  • ఎడిటర్  :

    ఎస్ ఆర్ శేఖర్

  • నటినటులు  :

    నితిన్, మేఘా ఆకాశ్, అర్జున్, అజయ్, రవి కిషన్ తదితరులు

Lie Movie Telugu Review

విడుదల తేది :

2017-08-11

Cinema Story

సత్యం(నితిన్) కు అబద్ధాలంటే మహాపిచ్చి. తాను పాపులర్ కావటానికి ఎంతకైనా తెగిస్తుంటాడు. అయితే చైత్ర(మేఘా ఆకాశ్) అతని చిలిపి అబద్ధాలకు పడిపోతుంది. వీళ్ల లవ్ స్టోరీ కొనసాగుతుండగానే.. సత్యంకు ఓ బాక్స్ దొరుకుతుంది. అక్కడి నుంచి అతని లైఫ్ టర్న్ అవుతుంది. ఇంతకీ ఆ బాక్స్ లో ఏముంది? దానికి అమెరికాలో బిజినెస్ మెన్ అయిన పద్మనాభం(అర్జున్) కు సంబంధం ఏంటి? చివరకు కథ ఎలా ముగుస్తుంది అన్నదే లై కథ. 

cinima-reviews
లై

కృష్ణగాడి వీరప్రేమగాథతో హిట్ కొట్టిన దర్శకుడు తర్వాత యంగ్ హీరో నితిన్ తో మూవీ అనగానే హైప్ క్రియేట్ అయ్యింది. పైగా ఈ యంగ్ హీరో రఫ్ లుక్, అర్జున్ కీ రోల్, ఆపై హీరోయిన్ మేఘా ఆకాశ్ లు సినిమాకు అదనపు ఆకర్షనగా నిలిచాయి. మరి ఈ చిత్రం ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిజల్ట్ ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

విశ్లేషణ...

ట్విస్ట్ లతో కూడిన టిపికల్ సబ్జెక్ట్ ను డీల్ చేయాలంటే ఇంటలిజెన్స్ ను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇక్కడ దర్శకుడు హను చాలా తెలివిగా రేసీ స్క్రీన్ ప్లేను ఫాలో అయ్యాడు. ఫస్టాఫ్ మొత్తం కేవలం క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ తోనే తెలివిగా కథను నడిపిన దర్శకుడు సెకాండాఫ్ చాలా వేగంగా నడిపించేశాడు. దీంతో ప్రేక్షకుడికి కథ ఎక్కడా బోరింగ్ గా అనిపించదు. అయితే కొన్ని సీన్లలో మాత్రం అది అంత కన్వింగ్స్ గా అనిపించదు.

సినిమాకు మేజర్ హైలెట్ నితిన్ అర్జున్ ల మధ్య వచ్చే మైండ్ గేమ్ కాన్సెప్ట్ లు. టామ్ అండ్ జెర్రీ తరహాలో సాగే ఎపిసోడ్ ఆకట్టుకుంది. అదే సమయంలో బోర్ కొట్టని లవ్ ట్రాక్ తో కథను బాగానే మ్యానేజ్ చేశాడు. ముఖ్యంగా చెప్పుకోదగింది యూఎస్ లో వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్.

నటీనటుల ఫెర్ ఫార్మెన్స్... నితిన్ మరోసారి చాలా కొత్తగా కనిపించటమే కాదు నటించాడు కూడా. యాక్సన్ ఎపిసోడ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. యాక్షన్ కింగ్ అర్జున్ చాలా రోజుల తర్వాత మంచి పాత్రతో మన ముందుకు వచ్చాడు. సినిమా మొత్తం ట్రావెల్ చేసే పాత్ర అది. మేఘా ఆకాశ్ చబ్బీ లుక్స్ తో క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. శ్రీరామ్, రవి కిషన్ మరియు అజయ్ సపోర్టింగ్ రోల్స్ లో అలరించారు.


టెక్నికల్ అంశాల విషయానికొస్తే... మణిశర్మ పాటలతోపాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కింగ్ అని మరోసారి నిరూపించాడు. అమెరికా లోకేషన్లను సినిమాటోగ్రఫీ చాలా మరింత రిచ్ గా చూపించాడు. ఎడిటింగ్ చాలా క్రంచ్ గా ఉంది. ప్రోడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.

 

ఫ్లస్ పాయింట్లు:

లీడ్ రోల్స్, 

కథ, టేకింగ్

లోకేషన్లు

 

మైనస్ పాయింట్లు:

లాజిక్ లేని కొన్ని సీన్లు

 

తీర్పు: 

తెలుగులో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్లాట్ తో వచ్చే సినిమాలు చాలా అరుదు. ట్విస్ట్ లతోపాటు కావాల్సినంత యాక్షన్ ఎపిసోడ్స్ ను, అదే టైంలో లవ్ ట్రాక్ ను బ్యాలెన్స్ చేస్తూ హను పక్కా కథను తెరకెక్కించాడు. మొత్తానికి నితిన్ కు ఓ మంచి సినిమానే అందించి ద్వితియ గండం నుంచి బయటపడ్డాడనే చెప్పొచ్చు.


చివరగా... లై ఓ పవర్ ప్యాక్ యాక్షన్ డ్రామా

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.