Raarandoi Veduka Choodham Movie Review and Rating

Teluguwishesh రారండోయ్ వేడుక చూద్దాం రారండోయ్ వేడుక చూద్దాం Raarandoi Veduka Choodham Telugu Movie Review and Rating. Story, Cast, Crew Performance and Public Talk. Product #: 82722 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రారండోయ్ వేడుక చూద్దాం

  • బ్యానర్  :

    అన్నపూర్ణ స్డూడియోస్

  • దర్శకుడు  :

    కళ్యాణ్ కృష్ణ కురసల

  • నిర్మాత  :

    అక్కినేని నాగార్జున

  • సంగీతం  :

    దేవీశ్రీప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    ఎస్పీ విశ్వేశ్వర్

  • ఎడిటర్  :

    గౌతంరాజు

  • నటినటులు  :

    నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, సంపత్ రాజ్, అన్నపూర్ణ, పోసాని, వెన్నెల కిషోర్ తదితరులు

Raarandoi Veduka Choodham Review

విడుదల తేది :

2017-05-26

Cinema Story

కథ:

తన ఫ్రెండ్ పెళ్లికి ఓ ఊరికి వెళ్లిన శివ(నాగ చైతన్య) అక్కడ భ్రమరాంబ(రకుల్ ప్రీత్ సింగ్) అనే పల్లెటూరి అమ్మాయిని చూసి ఇంప్రెస్ అవుతాడు. ఆ పెళ్లి వాళ్ల మధ్య ప్రేమను పుట్టిస్తుంది. ఆ తర్వాత ఎంబీఏ చదివేందుకు భ్రమరాంబ వైజాగ్ కు రావటంతో వారి ప్రేమ మరింత బలపడుతుంది.  అయితే వాళ్ల తండ్రుల మధ్య(జగపతిబాబు, సంపత్ రాజ్) మధ్య గొడవలు ఉన్నాయని తెలియటంతో వారిని ఒకటి చేసేందుకు రంగంలోకి దిగుతాడు శివ. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటాడు. చివరకు వాళ్ల పగకు ఎలా పుల్ స్టాప్ పెట్టి శుభం కార్డు వేస్తాడన్నదే కథ. 

cinima-reviews
రారండోయ్ వేడుక చూద్దాం

కెరీర్ మొదటి నుంచే లవర్ బాయ్ తరహా రోల్స్ తో ఆకట్టకుంటూ వస్తున్నాడు అక్కినేని నటన వారసుడు నాగచైతన్య. మధ్య మధ్య లో మాస్ టచ్ తో సినిమాలు తీసిన ప్రతీసారి దారుణమైన ఫలితాలనే చవిచూశాడు. దీంతో మళ్లీ లవ్ ట్రాక్ లనే నమ్ముకుని గత చిత్రం ప్రేమమ్ తో ఆకట్టుకున్నాడు. ఈసారి లవ్ తోపాటు ట్రెడిషనల్ టచ్ అంటూ రారండోయ్ వేడుక చూద్దాం అంటూ ఓ ఫ్యామిలీ డ్రామాతో మన ముందుకు వచ్చాడు.

నాగ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచిన సొగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణ్ కుమార్ కురసాల ఈ చిత్రానికి దర్శకుడు. మరి చైతూ కి ఈ ఫ్యామిలీ డ్రామా హిట్ అందించిందా? ఇప్పుడు తెలుసుకుందాం.

విశ్లేషణ:

కథ లైన్ పాత సినిమాలను గుర్తు చేసినప్పటికీ దానిని తెర మీద కొత్తగానే చూపించాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. అందుకు తగ్గట్లే భారీ తారాగణంను కూడా ఎంచుకున్నాడు. కానీ, అసలైన కథ అనే ఎలిమెంట్ ను సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాడు. రెండు కుటుంబాల మధ్య అపార్థాలను తొలగించి జంట ఒక్కటి కావటం అనే కాన్సెప్ట్ కొత్తేం కాదు. నిన్నే పెళ్లడతా.. రాముడొచ్చాడు ఇలా నాగ్ సినిమాలనే బహుశా దర్శకుడు ఇన్సిపిరేషన్ తీసుకుని ఉంటాడేమో. అయితే అదే సమయంలో కృష్ణ వంశీ తరహాలో భారీ కాస్టింగ్ నే తీసుకున్నప్పటికీ వారిని సరిగ్గా వాడుకోలేకపోయాడు.

రా రండోయ్ వేడుక చూద్దాం లో ఓ మంచి లవ్ స్టోరీతోపాటు ఫ్యామిలీస్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ, వాటిని తీర్చిదిద్దే క్రమంలోనే దారుణంగా తడబడ్డాడు. పాత్ర పాత్రకు సంబంధం లేకుండా ఓ ఫ్లో సినిమా సాగిపోతుంటుంది. మెయిన్ లీడ్ ల మధ్య కెమిస్ట్రీ, నటన ఆకట్టుకున్నప్పటికీ మిగతా పాత్రలను, అసలైన ఫ్యామిలీ ఎమోషన్స్ ను గాలికి వదిలేశాడు. ఫస్టాప్ ను సరదాగా కానిచ్చేసిన దర్శకుడు సెకండాఫ్ లో అసలైన కథను సరిగ్గానే హ్యాండిల్ చేయగలిగాడు.

కబడ్డీ ఫైట్, భ్రమరాంబతో గొడవ, కన్విన్స్ చేయటం ఇలా కొన్ని సీన్లు అలరిస్తాయి. కానీ, ప్రీ క్లైమాక్స్ నుంచి మొదలైన వేగం క్లైమాక్స్ ను ముగించిన తీరు కూడా అంతగా ఆకట్టుకోదు. సాదాసీదా కథనే ఎంచుకున్నప్పటికీ కనీసం ఎంటర్ టైన్ అనే ఎలిమెంట్ ను జోడించి ఉంటే రారండోయ్.. రిజల్ట్ వేరేలా ఉండేదేమో?

నటీనటుల విషయానికొస్తే... నాగ చైతన్య నటనలో మెచ్యూరిటీ ఇంకాస్త పెరిగినట్లు అనిపించకమానదు. కుటుంబం కోసం ఆరాటపడే యువకుడిగా ఎనర్జిటిక్ ఫెర్ ఫార్మెన్స్ ను అందించాడు. రకుల్ న్యూ లుక్ తోనే కాదు.. కెరీర్ లో స్కోపింగ్ ఉన్న బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ ను అందించింది. సినిమాకు తగ్గట్లు ట్రెడిషనల్ లుక్కుతో కవ్వించింది. హీరో ఫాదర్ గా జగపతిబాబు మరోసారి మంచి ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. సంపత్ రాజ్ కూడా ఎప్పటిలాగే కానిచ్చేశాడు. వెన్నెల కిషోర్ కామెడీ ఎపిసోడ్స్ హిల్లేరియస్ గా ఉంటాయి. మిగతా పాత్రలు ఫర్వాలేదనిపించాయి.

టెక్నికల్ టీం... దేవీశ్రీప్రసాద్ పాటలతోనే కాదు.. బ్యాగ్రౌండ్ స్కోర్ తో కూడా ఆకట్టుకున్నాడు. విశ్వ కెమెరా పనితనం పల్లెటూరి అందాలను బాగా చూపించాడు. బ్యూటీఫుల్ పాటలకు కూడా కెమెరా ఫోటోగ్రఫీ హెల్ప్ చేసింది. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం లాంటి డైలాగులు సింపుల్ గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే రేసీగా వెళ్లిపోవటం సినిమాకు కలిసొచ్చే అంశం. అన్ని బాగానే ఉన్నా డైరక్షన్ డిపార్ట్ మెంట్ కాస్త వీక్ గా కనిపించటం మైనస్ గా మారింది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ఫ్లస్ పాయింట్లు:

నాగ చైతన్య, రకుల్ నటన కెమిస్ట్రీ

సెకండాఫ్ కొన్ని సీన్లు

 

 


మైనస్ పాయింట్లు:

బోరింగ్ ఫస్టాఫ్

క్లైమాక్స్ హడావుడిగా ముగించేయటం

కథలో పస లేకపోవటం


తీర్పు:

ఓ ప్రేమకథకు కుటుంబ కలహాల కాన్సెప్ట్ జోడించిన దర్శకుడు కథలో ఏ మాత్రం ఫ్రెష్ నెస్, ఎమోషనల్ కంటెంట్ లేకుండా తీర్చిదిద్దాడు. దీంతో రారండోయ్ ఓ సాదాసీదా సినిమాగానే మిగిలిపోయింది.


చివరగా... రారండోయ్ వేడుక చూద్దాం.. ఓ రొటీన్ ఫ్యామిలీ డ్రామా

 

 

 

 

 

more

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.