Radha Telugu Movie Review Boring Narration

Teluguwishesh రాధ రాధ Sharwanand's Radha Movie Review and Rating along with Story highlights in concise. Product #: 82509 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రాధ

  • బ్యానర్  :

    శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర

  • దర్శకుడు  :

    చంద్రమోహన్

  • నిర్మాత  :

    భోగవల్లి బాపినీడు

  • సంగీతం  :

    రాధన్

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • ఛాయాగ్రహణం  :

    కార్తీక్ ఘట్టమనేని

  • ఎడిటర్  :

    మధు

  • నటినటులు  :

    శర్వానంద్, లావణ్య త్రిపాఠి, అక్ష, రవికిషన్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు

Radha Movie Review

విడుదల తేది :

2017-05-12

Cinema Story

కథ...

చిన్నప్పటి నుంచే కృష్ణుడి భక్తుడి అయిన రాధా కృష్ణ(శర్వానంద్) పోలీస్ కావాలనే కలకంటుంటాడు. సమాజంలోని చెడును దేవుడే వచ్చి ఎలాగూ రక్షించలేడు కాబట్టి తానే పోలీస్ రూపంలో ఆ పని చేయాలనుకుంటాడు. ఎలాగోలా పోలీస్ ట్రెయినింగ్ పూర్తి చేసుకున్న రాధకు జీరో క్రైమ్ రేట్ ఉన్న ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ రాధ(లావణ్య త్రిపాఠి) తో ప్రేమాయణం కొనసాగిస్తాడు మోడ్రన్ కృష్ణుడు. 

అయితే పరిస్థితుల ప్రభావంతో రాధను హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి ట్రాన్స్ ఫర్ చేస్తారు అధికారులు. అక్కడ బలమైన శత్రువు (రవికిషన్) తగలటంతో బుద్ధిబలంతో అతన్ని గెలవాలని డిసైడ్ అవుతాడు. మరి ఆ టామ్ అండ్ జెర్రీ గేమ్ లో రాధ విజయం సాధిస్తాడా? తాను చదివిన శ్లోకం సారాంశం నుంచి ఎలాంటి సందేశం ఇస్తాడు అన్నదే కథ... 

cinima-reviews
రాధ

టాలీవుడ్ యంగ్ హీరోల్లో లక్కీ మస్కట్ గా శర్వానంద్ కు ఓ పేరుంది. చిన్న హీరోగా కెరీర్ ను ప్రారంభించి ప్రతిష్టాత్మక బ్యానర్ లో నటిస్తూ లాభాలు తెప్పించే కల్పవృక్షంగా మారిపోయాడు. ఇక ఇప్పుడు ఓ హ్యాపీ పోలీసాఫీసర్ రోల్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రాధ తో మన ముందుకు వచ్చాడు.

కరుణాకరన్ దగ్గర శిష్యరికం చేసిన చంద్రమోహన్ దర్శకుడిగా మారి చిత్రాన్ని తీయగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. శర్వానంద్ సక్సెస్ ట్రాక్, కామెడీ ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి శర్వా తన విజయపరంపరను కొనసాగించాడా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్దాం.

విశ్లేషణ...

ఓ మంచి ఆశయంతో సరదాగా ఉండే ఓ కుర్రాడు పోలీస్ గా మారి చేసే సాహసమే ఈ సినిమా కథ. మాములుగా ఓ స్టోరీకి కామెడీ టచ్ ఇచ్చినప్పుడు దానికి ఓ ట్విస్టో లేక ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ తగిలిస్తే సక్సెస్ అందుకోవటం ఖాయం. కానీ, దర్శకుడు చంద్రమోహన్ రెండింటిలో దేనిపై ఆధారపడకపోవటం దారుణం. ఓ ఎనర్జిటిక్ కాప్ కథనే లైన్ గా తీసుకున్నప్పటికీ దానిని ఆసక్తికరంగా మలచలేకపోయాడు. గబ్బర్ సింగ్, రేసు గుర్రం క్లైమాక్స్ పార్ట్, ఇలా మొత్తం కలగూరగంపగా మారిపోయి ఎటూ కాకుండా పోయింది.

లాజిక్ లు లేని సన్నివేశాలు, మధ్య మధ్యలో వచ్చి పోయే కొన్ని పాత్రలు.. ఇలా అర్థం కానీ పరిస్థితితో చాలా గందరగోళంగా సాగుతుంటుంది మూవీ. అయితే రన్ టైం తక్కువగా ఉండటం, మధ్య మద్యలో పేలే కొన్ని కామెడీ బిట్లు ఫర్వాలేదనిపిస్తాయి. సో.. సో... గా సాగిపోయే ఫస్టాఫ్.. లాజిక్ లేకుండా బోరింగ్ గా సాగిపోయే సెకండాఫ్ ఇది రాధ రిజల్ట్.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికొస్తే... శర్వానంద్ ఎప్పటిలాగే ఎనర్జిటిక్ రోల్ తో అలరించాడు. అయితే పోలీసాఫీసర్ బాడీ లాంగ్వేజ్ సూటయ్యే క్యారెక్టర్ ను అంతగా పండించలేకపోయాడు. కొన్ని సీన్లలో అతిలాగ అనిపించకమానదు. డాన్సులు, ఫైట్ల వరకు ఓకే. ఇక హీరోయిన్లను జస్ట్ పాటల కోసమే వాడుకున్నట్లు ఉంది. మెయిన్ లీడ్ లావణ్య పాత్రను కూడా లిమిట్ గా వాడుకున్నారు. అక్ష పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. సపోర్టింగ్ కమెడియన్లు ఫర్వాలేదనిపించారు. విలన్ రవికిషన్ తో శర్వా ఆడుకునే సీన్లు కిక్ సినిమా కామెడీని తలపిస్తాయి.

టెక్నికల్ పరంగా... రాధన్ అందించిన పాటలు అంతగా గుర్తుండవు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రంగానే ఆకట్టుకుంది. విజువల్ కార్తీక్ ఘట్టమనేని అందించిన కెమెరా పనితనం పాటలు, టోటల్ సినిమాకే అందానిచ్చాయి. కామెడీ పంచ్ డైలాగులు అక్కడక్కడ పేలాయి. మధు అందించిన ఎడిటింగ్ బాగానే ఉన్నప్పటికీ సినిమా బోరింగ్ నేరేషన్ తో అంతగా వర్కువట్ కాలేకపోయింది. ప్రోడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.


ఫ్లస్ పాయింట్లు:

అక్కడక్కడ పేలే కామెడీ
రన్నింగ్ టైం

 

మైనస్ పాయింట్లు:

స్టోరీ.. స్క్రీన్ ప్లే.. డైరక్షన్


తీర్పు:

ఎంచుకున్న స్టోరీ లైన్ మంచిదే అయినప్పటికీ దర్శకుడి అనుభవరాహిత్యం సినిమా అంతటా కనిపించింది. రోటీన్ స్టోరీ.. సెకండాఫ్ లో స్లో నారేషన్ తో నడవడం.. పాత్రలను సరిగ్గా తీర్చిదిద్దలేకపోవటం ప్రేక్షకులను నిరాశ కలిగిస్తాయి.

చివరగా.. రాధ.. కొన్ని నవ్వులే... కొత్తదనం ఏం లేదు.

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.