రివ్యూ: లక్కున్నోడు ఇరిటేషన్ తెప్పిస్తాడు | Luckunnodu Movie Review.

Teluguwishesh లక్కున్నోడు లక్కున్నోడు Manchu Vishnu's Luckunnodu Movie Review. Product #: 80543 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    లక్కున్నోడు

  • దర్శకుడు  :

    రాజ్‌కిరణ్‌

  • నిర్మాత  :

    ఎం.వి.వి.సత్యనారాయణ

  • సంగీతం  :

    అచ్చు, ప్రవీణ్‌ లక్కరాజు

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    పి.జి.విందా

  • నటినటులు  :

    మంచు విష్ణు, హన్సిక మోత్వాని, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్‌, పోసారి కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, సత్యంరాజేష్‌ తదితరులు

Luckunnodu Movie Review

విడుదల తేది :

2017-01-26

Cinema Story

కథ:

లక్కీ(మంచు విష్ణు) పుట్టుకతోనే దురదృష్టవంతుడనే అగ్రో మార్క్ వేయించుకుంటాడు. అతని బ్యాడ్ లక్  కారణంగా దారుణంగా నష్టపోయిన తండ్రి కూడా కొడుక్కంటే అసహ్యించుకుని మాట్లాడటమే మానేస్తాడు. ఎలాగైనా తన తండ్రితో ప్రేమగా పిలుపించుకోవాలనే పట్టుదలతో ఉంటాడు. ఇదిలా ఉంటే ఓరోజు పాజిటివ్ పద్మావతిని చూసి ప్రేమలో పడతాడు. మొదట గొడవ పడ్డప్పటికీ చివరికి ఎలాగోలా ముగ్గులోకి దించుతాడు. కథ ఇలా సాగుతుండగా తన చెల్లి పెళ్ళి కోసం తీసుకెళ్తున్న డబ్బు పొగొట్టి తండ్రి చేత తిట్లు తిన్న లక్కీ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అంతో ఓ వ్యక్తి లక్కీకి ఓ బ్యాగ్‌ ఇచ్చి దాన్ని ఓ రోజు జాగ్రత్తగా దాస్తే కోటి రూపాయలిస్తానని చెబుతాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? ఆ బ్యాగ్‌ అతని బ్యాడ్ లక్ పొగొట్టిందా? తండ్రి లక్కీకి ఎలా దగ్గరవుతాడు? అన్నదే కథ. 

cinima-reviews
లక్కున్నోడు

కామెడీ ఎంటర్‌టైనర్‌ లనే నమ్ముకుని వాటితో చక్కటి ఫలితాలను అందుకున్నాడు మంచు వారబ్బాయి విష్ణు. అయితే సోలో హిట్ లేక చాలా కాలమే అవుతోంది. అందుకే మరోసారి అదే జోనర్ ను నమ్ముకుని లక్కున్నోడు తో మన ముందుకు వచ్చాడు. గీతాంజలి, త్రిపుర వంటి హర్రర్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేసిన రాజ్‌కిరణ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ వారం సినిమాలేవీ లేకపోవటంతో ఆ అడ్వాంటేజ్ ను వాడుకుందామని ఊహించని రీతిలో ప్రీ పోన్ చేసుకుని మరీ రిలీజ్ చేవాడు. మరి విష్ణు ప్రయత్నం ఫలించిందా..? లక్కున్నోడు విష్ణు కి సోలో హిట్ అందించిందా చూద్దాం. 

విశ్లేషణ:

హిట్లు లేకుండా సతమతమయ్యే హీరోలు ఎంచుకునే ఏకైక ఫార్ములా కామెడీ జోనర్. కథ, కథనాలు పాతవే అయినప్పటికీ, వాటిని సరిగ్గా జనాలకు ఎక్కేలా ఎంటర్ టైనింగ్ గా చూపిస్తే చాలూ ఆటోమేటిక్ గా ఆ బొమ్మ హిట్టే అవుతుంది. కానీ, దర్శకుడు రాజ్ కిరణ్ లక్కున్నోడు విషయంలో మాత్రం ఆ ఫార్ములాను ఫాలో కాలేకపోయాడు. అప్పుడెప్పుడో 80 లలో వచ్చిన సినిమాల కథను పేపర్ మీద పెట్టుకుని దానిని అలాగే చూపించాడా? అన్న అనుమానాలు కలగక మానవు. పోనీ ఆడియన్స్ ను కూర్చోబెట్టే ఫన్నీ ఎపిసోడ్లు ఏవైనా ఉన్నాయా? అంటే అది కూడా అందించలేకపోయాడు.

కథ పాతదే అయినా ఎంచుకున్న నటీనటులు మంచి వారే. కానీ, దానిని స్క్రీన్ పై సరిగ్గా డీల్ చేయలేకపోయాడు. హీరో ఆత్మ హ‌త్య చేసుకొందామ‌నుకొన్న సీన్ నుంచి తండ్రి అపార్థం చేసుకున్నానంటూ బోరుమనే సన్నివేశం దాకా అన్ని పాత చింతకాయ పచ్చడి సీసాలోనివే. ఇక లవ్ ట్రాక్ అయితే మరీ ఘోరం. సినిమాకు ఏ మాత్రం ఉపయోగపడలేదు సరికదా ఇరిటేషన్ తెప్పిస్తాయి.

నటీనటుల విషయానికొస్తే... విష్ణు కామెడీ టైమింగ్ మాములుగానే బాగుంటుంది. ఇందులో ఇంకాస్త బెటర్ మెంట్ చూపించాడు. అయితే ఆ ఫ్లాన్ పెద్దగా వర్కువుట్ కాలేదనిపించకమానదు. మ్యావ్.. మ్యావ్ అంటూ చేసే కామెడీ చిరాకు పుట్టిస్తుంది. హ‌న్సిక లుక్కు పరంగా ఎంత ముదిరిపోయిందో అనిపించకమానదు. క్యారెక్టర్ కూడా పెద్దగా స్కోప్ లేదు. స‌త్యం రాజేష్‌, ప్ర‌భాస్ శీను, వెన్నెల కిషోర్ ఉన్నంతలో కాస్త బెట‌ర్ అన్న ఫీలింగ్ కలగక మానదు‌.

సాంకేతిక వర్గం... ఈ సినిమాకి ముగ్గురు సంగీత ద‌ర్శ‌కులు ప‌ని చేసిన అవుట్ పుట్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. కెమెరా వ‌ర్క్ బాగానే ఉంది. సినిమారిచ్‌గా చూపించారు. ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్లు ఓకే అనిపించాయంటే అదంతా మాట‌ల ర‌చ‌యిత డైమండ్ ర‌త్న‌బాబు చ‌ల‌వే‌. కానీ సినిమాను అవి నిలబెట్టలేకపోయాయి. క‌థ‌, క‌థ‌నాల‌పై శ్ర‌ద్ద పెట్ట‌కుండా ఏదో మొక్కుబడిగా కానిచ్చేయటంతో సినిమా తేలిపోయింది. నిర్మాతగా విష్ణు బాగానే ఖర్చుపెట్టినా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడం కాస్త కష్టమే.


ఫస్ పాయింట్లు:
- ఫస్టాఫ్‌
- ఇంటర్వెల్‌ బ్లాక్‌

మైనస్ పాయింట్లు:
- లాజిక్‌ లేని కథ, బోరింగ్ కథనం
- ఎడిటింగ్‌
- పాటలు

తీర్పు:
ఓ మంచి సినిమాను అందించాలన్న ఉద్దేశంతో కాకుండా కేవలం ఆడియ‌న్స్‌కి ట‌చ్‌లో ఉండాలన్న ఇంటెన్షన్ తో విష్ణు మరీ ఇంత దారుణమైన కథను ఎంపిక చేసుకున్నాడా? అని అనిపించకమానదు. ఆడియ‌న్స్‌కి విసుగురావ‌డం త‌ప్ప‌, లక్కున్నోడు సాధించింది ఏం లేదనిపిస్తోంది. ఇంటర్వెల్ కు ముందు క‌థ‌లో కాస్త జర్క్ వ‌చ్చినా తర్వాత కథే లేకపోవటంతో విసుగు పుడుతుంది. పైగా ఆడియ‌న్స్‌ని కూర్చోబెట్టాలంటే కావాల్సిన ఫ‌న్నీ ఎపిసోడ్లు కూడా మిస్సయ్యాయి. వెరసి లక్కున్నోడు ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది.

చివరగా... లక్కున్నోడు... కామెడీ పేరిట చేసిన ఓ కమర్షియల్ ఇరిటేటింగ్ డ్రామా.

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.