రామ్ హైపర్ మూవీ రివ్యూ | Ram's Hyper telugu movie review.

Teluguwishesh హైపర్ హైపర్ Ram's Hyper telugu movie review. Product #: 77979 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    హైపర్

  • బ్యానర్  :

    14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్

  • దర్శకుడు  :

    సంతోష్ శ్రీనివాస్

  • నిర్మాత  :

    రామ్ అచంట, అచంట గోపినాథ్, అనిల్ సుంకర, వెంకట్ బోయిన్ పల్లి

  • సంగీతం  :

    గిబ్రాన్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    సమీర్ రెడ్డి

  • ఎడిటర్  :

    గౌతం రాజు

  • నటినటులు  :

    రామ్, రాశిఖన్నా, సత్యరాజ్, నరేష్, తులసీ తదితరులు

Hyper Telugu Movie Review

విడుదల తేది :

2016-09-30

Cinema Story

కథ:

సూరికి(రామ్ ) కి తండ్రి నారాయణ మూర్తి (సత్యరాజ్) అంటే ప్రాణం. ఎంతలా అంటే భరించలేనంత. తండ్రికి ఆ కొడుకు ప్రేమ హింసగా అనిపిస్తుంది. అయినా సూరి మాత్రం దాన్ని అలాగే కంటిన్యూ చేస్తాడు. ఓసారి గుళ్లో భానుమతి(రాశిఖన్నా)ని చూసి ఈ అమ్మాయి ఏ ఇంటి కొడలు అవుతుందో అంటాడు. అంతే భానుని ముగ్గులోకి దించేస్తాడు సూరి. అంతా హ్యాపీస్ అనుకుంటున్న సమయంలో తాను కట్టే ఓ కమర్షియల్ కాంప్లెక్స్ కి పర్మిషన్ ఇవ్వాలంటూ  మినిష్టర్ రాజప్ప (రావు రమేష్) నారాయణ మూర్తి ని ఇబ్బంది పెడుతుంటాడు. ఇక తండ్రి కోసం రంగంలోకి దిగిన సూరి విలన్ల తాట తీస్తుంటాడు. ఈ లోపు భానుమతి ఓ ట్విస్ట్ ఇస్తుంది. అంతలో గజ (మురళి శర్మ) అనే వ్యక్తి కథను మరో మలుపు తిప్పుతాడు. అసలు ఆ ట్విస్టులు ఏంటి? వాటన్నింటిని పరిష్కరించుకుని సూరి హ్యాపీ ఎండింగ్ ఎలా ఇస్తాడు అన్నదే కథ. 

 

cinima-reviews
హైపర్

వరుస ఫ్లాపులతో ఢీలా పడిపోయిన రామ్ కి కొత్త దర్శకుడు తిరుమల కిషోర్ పుణ్యమాని నేను శైలజతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. అయితే తదుపరి సినిమా మళ్లీ తన రెగ్యులర్ ఫార్మట్ అయిన యాక్షన్ పార్ట్ లోకి వెళ్లిపోయి హైపర్ అంటూ మన ముందుకు వచ్చేశాడు. గతంలో కందిరీగతో మాంచి హిట్ ఇచ్చాడు సంతోష్ శ్రీనివాసన్. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు అన్న ట్యాగ్ లైన్ తో వచ్చిన హైపర్ ఈ రోజే రిలీజైంది. చిత్రం విడుదలైంది మరి ఫలితం ఎలా ఉందో చూద్దామా?

విశ్లేషణ:

తండ్రి కొడుకుల సెంటిమెంట్, తండ్రిని విలన్లు ఇబ్బంది పెట్టం, మైండ్ గేమ్ తో వారి భరతం పట్టి చివరకు కథను సుఖాంతం చేయటం ఇది పాత తెలుగు సినిమాల నుంచి వస్తున్న తంతే. అనాదిగా వస్తున్న చాలా చిత్రాల్లో చూసిందే. కొత్త పాయింట్ తో దర్శకుడు ఇందులో చెప్పింది ఏం లేదు. చాలా సినిమాల్లో ఇప్ప‌టికే బిట్లు బిట్లుగా చూసేసి ఉంటాం. అయితే ఆ క‌థ‌నే క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్ది ప్ర‌జెంట్ చేశాడు అంతే. తండ్రి కోసం ఏకంగా మంత్రి మనుషులనే హీరో పేకాటాడేసుకోవటం, హీరోయిన్ ను చూసి తండ్రి బావుంది అనగానే హీరో లైనేసేయటం, కొన్ని సీన్లలో తండ్రి కొడుకుల అతి, అన్నింటికి మించి రామ్ యాక్షన్ సీన్లు చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. అయితే ఫస్టాఫ్ లో పెట్టిన కామెడీ సీన్లు, రాఖిఖన్నా అందాలు కాసేపు మొహం స్క్రీన్ వైపు తిప్పుకునేలా చేస్తాయి.

ఇక నటీనటుల విషయానికొస్తే... రామ్ ఎప్పటిలాగే తనకు అచ్చొచ్చిన యాక్షన్ తో కానిచ్చేశాడు. సెంటిమెంట్ సీన్లలో మాత్రం కాస్త జీవించినప్పటికీ, మిగతాదంతా రెగ్యులర్ గానే అనిపిస్తుంది. డైలాగ్ డెలివరీలో జోష్ చూపించాడు. ఎనర్జిటిక్ స్టార్ కావటంతో ఆ స్థాయిలోనే రెచ్చిపోయి నటించాడు. రాఖిఖన్నా గత రెండు చిత్రాల్లో నటనకు ఆస్కారం ఉన్నప్పటికీ, ఇప్పుడు మాత్రం ఏం చేయలేకపోయింది. కేవలం గ్లామర్ షో అది కూడా ఫస్టాఫ్ కి మాత్రమే పరిమితమైంది. సెకండాఫ్ లో ఈ ముద్దుగుమ్మ అస్సలు కనిపించదు. వీరి తర్వాత చెప్పుకోదగింది రావు రమేష్ గురించి. కామెడీ టచ్ తో కూడిన సీరియస్ విలన్ పాత్రను అలవోకగా పోషించాడు. రావు రమేష్ డైలాగులు కొన్ని గుర్తుంటాయి. రిటైర్ మెంట్ కి దగ్గర పడుతున్న ప్రభుత్వ ఉద్యోగిగా, కొడుకు పిచ్చి ప్రేమకు బాధితుడిగా సత్యరాజ్ న్యాయం చేశాడు. మిగతా వారు జస్ట్ ఓకే.

టెక్నికల్ పరంగా... మ్యూజిక్ విషయంలో జిబ్రాన్ నిరాశపరిచాడు. ఆడియో పరంగానే కాదు, వీడియో పరంగానూ ఒక్క పాట గుర్తుండి చావదు. బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ మణిశర్మ మ్యాజిక్ కూడా పనిచేయలేదు. స‌మీర్‌రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ రిచ్‌గా, క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. లోకేష‌న్లు చ‌క్క‌గా క‌వ‌ర్ అయ్యాయి. గౌతంరాజు ఎడిటింగ్ ఓకే. ర‌న్ టైం 143 నిమిషాలు కావ‌డం ప్ల‌స్ అయ్యింది. అబ్బూరి ర‌వి పంచ్ డైలాగ్స్ కొన్ని బాగా పేలాయి. 14 రీల్స్ నిర్మాణ విలువ‌లకు ఎప్పుడూ వంక పెట్ట‌లేం.

ఫ్లస్ పాయింట్లు:

రామ్ ఎనర్జిటిక్ నటన
ఎంటర్ టైనింగ్ ఫస్టాఫ్
కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు
ట్విస్టులు

మైనస్ పాయింట్లు:
పాత కథ
ఓవర్ యాక్షన్ సీన్లు
పాటలు, బ్యాగ్రౌండ్


కథ కాస్త పాతదే అయినా దానికి తండ్రంటే విపరీతమైన ప్రేమ అన్న టచప్ ని చేసి , కాసేపు కామెడీ తగ్గకుండా, కథలోని ఎమోషన్‌ను చివరివరకూ కొనసాగిస్తూ అల్లిన స్ర్కీన్‌ప్లే అల్లాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. బీ, సీ సెంటర్ల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే అంశాలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా ప్రేక్షకులు ఈ రెగ్యులర్ సినిమాను మైండ్ లోకి ఎక్కించుకోవటం కొంచెం కష్టమే.

చివరగా... హైపర్ ఊహించినంత హైప్ మాత్రం లేదులేండి.

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.