జ్యో అచ్యుతానంద రివ్యూ | jyo achyuthananda movie review

Teluguwishesh జ్యో అచ్యుతానంద జ్యో అచ్యుతానంద Jyo Achyuthananda movie review. Product #: 77633 3.25 stars, based on 1 reviews
 • చిత్రం  :

  జ్యో అచ్యుతానంద

 • బ్యానర్  :

  వారాహి చలన చిత్రం

 • దర్శకుడు  :

  శ్రీనివాస్ అవసరాల

 • నిర్మాత  :

  సాయి కొర్రపాటి

 • సంగీతం  :

  కళ్యాణి మాలిక్

 • సినిమా రేటింగ్  :

  3.253.253.25  3.25

 • ఛాయాగ్రహణం  :

  వెంకట్ సి దిలీప్

 • ఎడిటర్  :

  కిరణ్ గంటి

 • నటినటులు  :

  నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా కస్సాండ్రా, పావని తదితరులు

Jyo Achyuthananda Movie Review

విడుదల తేది :

2016-09-09

Cinema Story

కథ:
అచ్యుత్‌రామయ్య(నారారోహిత్‌), ఆనంద్‌ వర్ధన్‌రావ్‌(నాగశౌర్య) అన్నదమ్ములు ఒకరంటే ఒకరికి ప్రాణం. అయితే వారింట్లోకే కాదు, వారి జీవితాల్లోకి ప్రవేశించిన జ్యోత్స్న(రెజీనా)తో ఇద్దరికి ఒకరంటే ఒకరు పడన స్టేజీకి వెళ్లిపోతారు. ఇద్దరన్నదమ్ములు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. కానీ జ్యో మాత్రం ఇద్దరినీ ప్రేమించటం లేదని చెప్పేస్తుంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల జ్యో అమెరికాకు వెళ్ళిపోతుంది. కానీ అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు అయినా జ్యో పెట్టిన చిచ్చు మాత్రం ఆరిపోదు. కొంతకాలం తర్వాత జ్యో మళ్ళీ ఇండియా వస్తుంది. తన వల్లే విడిపోయిన అన్నదమ్ములను, తానే మళ్లీ ఒకటి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అందుకోసం ఏం చేస్తుంది? అపార్థాలు తొలగిపోయి చివరికి అన్నదమ్ములు ఎలా ఒకటయ్యారు అన్నదే కథ.

cinima-reviews
జ్యో అచ్యుతానంద

ఊహలు గుసగుసలాడే తో దర్శకుడిగా మారిన శ్రీనివాస్ అవసరాల తొలి ప్రయత్నంతో హిట్ అందుకున్నాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తో ఇప్పుడు జ్యో అచ్యుతానంద అంటూ మరో సున్నితమైన ప్రేమకావ్యంతో మన ముందుకు వచ్చాడు. అన్నదమ్ములకు, ఓ యువతికి మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో ఇది రూపుదిద్దుకోంది. వరుసగా ఫ్లాపులతో ఉన్న నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనాలు ఇందులో ప్రధాన తారాగణం. మరి ఈ ముగ్గురి కెరీర్ కి కీలకమైన ఈ సినిమా ఫలితం ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

విశ్లేషణ:

ఒక సినిమా ప్రేక్షకులకు దగ్గర కావాలంటే అది సాధారణ వ్యక్తి జీవితానికి దగ్గర ఉన్నట్లుగా చూపించాలి. తన తొలి చిత్రం ఊహలు గుసగుసలాడేతో ఇదే ప్రయత్నం చేసిన అవసరాల ఇప్పుడు అదే పని చేశాడు. కాకపోతే ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా టార్గెట్ చేసి మంచి ఫలితాన్నే అందుకున్నాడని చెప్పొచ్చు. ప్రధాన పాత్రధారుల మధ్యన వచ్చే సన్నివేశాలు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. చాలా చిన్న సింపుల్ కథను సినిమాగా మలచడంలో స్క్రీన్‌ప్లే అనే ఆయుధాన్ని అర్థవంతంగా వాడుకున్న దర్శకుడి ప్రతిభను అభినందించకుండా ఉండలేం. ఫస్టాఫ్ ఎంత చలాకీగా సాగిపోతుందో... సెకంఢాఫ్ అంత ఎమోషనల్ గా ఉంటుంది. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు కట్టిపడేసేలా ఉంటుంది. మధ్యలో హీరోయిన్ రివెంజ్ డ్రామా, కథనం కాస్త స్లో అనిపించడం లాంటి మైనస్ లు ఉన్నా అవేం సినిమా ఫీల్ ను చెడగొట్టలేకపోయాయి.

ఇక నటీనటుల విషయానికొస్తే... కేవలం మూడు పాత్రలే మొత్తం కనిపిస్తుంటాయి. నారా రోహిత్ లుక్స్ పరంగా కాస్త ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ, నటనలో మాత్రం ఎప్పటిలాగే అదరగొట్టాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో రోహిత్ డైలాగులు బావున్నాయి. నాగశౌర్య క్యారెక్టర్ ఈ మూడింటిలో మేజర్ అస్సెట్స్ అని చెప్పొచ్చు. చలాకీ కుర్రాడిగా, కాస్త అమాయకత్వం ఉన్నపాత్రలో జీవించేశాడు. ఇక రెజీనా కెరీర్ లో తొలిసారి పూర్తిస్థాయిలో నటించిందని చెప్పొచ్చు. అన్నదమ్ముల మధ్య వచ్చే గొడవలతో వచ్చే కామెడితో పాటు ఎమోషన్స్‌ను యాడ్‌ చేయడం సినిమాకు ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అన్నదమ్ములు కలుసుకునేటప్పుడు వచ్చే ఎమోషన్స్‌ ప్రేక్షకుల గుండెలను బరువెక్కిస్తుంది. క్లైమాక్స్ లో నాని ఎంట్రీ విజిల్స్ వేయిస్తుంది. మిగతా పాత్రలు పరిధిలో నటించినా పెద్దగా గుర్తుండవు.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... మ్యూజిక్ పరంగా కళ్యాణ్ మాలిక్ యావరేజ్ మార్కులు వేయించుకున్నాడు. ‘ఒక లాలనా’ పాట మాత్రం సినిమా అయ్యాక కూడా వెంటాడుతూనే ఉంటుంది. వెంకట్‌ సి.దిలీస్‌ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రతి సీన్‌ను ఫ్రెష్‌లుక్‌తో చూపించాడు. కిరణ్‌గంటి సెకండాఫ్‌లో కొంత తన కత్తెరకు పనిచెప్పుంటే బావుండేదనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ వారాహి చలన చిత్ర కదా సో వంకపెట్టలేం.

తీర్పు:
సరదాగా సాగుతూ ఎక్కడో ఓచోట ఆలోచింపజేసేలా సాగే సన్నివేశాలు, సందర్భానుసారంగా నవ్వించే సన్నివేశాలు కూడా తోడైతే అవి చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అవసరాల శ్రీనివాస్ తన రచనతో చేసిన అలాంటి మ్యాజిక్కే ‘జ్యో అచ్యుతానంద’. మధ్యలో కాస్త స్లో గా అనిపించినా చివరివరకూ ఆసక్తికరంగా, ఓ బలమైన సినిమాగా మలచడంలో సఫలమయ్యాడు. అయితే ఎటొచ్చి బీ, సీ సెంటర్ల ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు ఎక్కువ లేకపోవటం ఒక్కటే లోటు.

చివరగా... క్లీన్ అండ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జ్యో అచ్యుతానంద. తప్పక చూడాల్సిన సినిమా.

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.