100 డేస్ ఆఫ్ లవ్ రివ్యూ | 100 days of love telugu movie review

Teluguwishesh 100 డేస్ ఆఫ్ లవ్ 100 డేస్ ఆఫ్ లవ్ 100 days of love telugu movie review. Product #: 77357 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    100 డేస్ ఆఫ్ లవ్

  • బ్యానర్  :

    ఎస్.ఎస్.సి.మూవీస్, అభిషేక్ పిక్చర్స్ సమర్పణ

  • దర్శకుడు  :

    జీనస్ మహమ్మద్

  • నిర్మాత  :

    వెంకట రత్నం

  • సంగీతం  :

    గోవింద్ మీనన్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    ప్రతీష్ వర్మ

  • ఎడిటర్  :

    సందీప్ కుమార్

  • నటినటులు  :

    దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, శేఖర్ మీనన్, అజు వర్గీస్, వినీత్, ప్రవీణ, రాహుల్ మాధవ్ తదితరులు

100 Days Of Love Telugu Movie Review

విడుదల తేది :

2016-08-26

Cinema Story

కథ
రావుగోపాల రావు(సల్మాన్ దుల్కర్) తొలి చూపులోనే సావిత్రి(నిత్యామీనన్) చూసి లవ్ లో పడిపోతాడు. ఓ టాక్సీలో ఆమె తన బ్యాగును మరిచిపోవటంతో, తిరిగి ఇచ్చేందుకు ఆమె కోసం వెతుకుతుంటాడు. చివరికి ఎలాగోలా ఆమెను కలిశాక, ఆమె తాను చిన్నప్పుడు ఎంతగానో అసహ్యించుకన్న తన స్కూల్ మేట్ అని తెలుస్తోంది. అప్పటి నుంచి సావిత్రిని పక్కనపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ, సావిత్రి మాత్రం అతనికి దగ్గరవుతూనే ఉంటుంది. ఈ గ్యాప్ లో సావిత్రికి మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ జరగటం, ఆపై గోపాల్ రావుకి ఆమె ప్రేమ కలగటం ఒకేసారి జరుగుతాయి. మరి ఈ విచిత్ర పరిస్థితుల్లో వారు ఎలా ఒకటవుతారు అన్నదే కథ.

cinima-reviews
100 డేస్ ఆఫ్ లవ్

కొన్ని సినిమాలకు కొన్ని కొన్ని సెంటిమెంట్లు బాగా వర్కవుట్ అవుతాయి. అలాంటి వాటిలో హిట్ పెయిర్ తో కూడా సినిమాలు ఆడిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అలాంటి జంటే నిత్యామీనన్- దుల్కర్ సల్మాన్. గతంలో వీరిద్దరు నటించిన మూడు చిత్రాలు బ్లాక బస్టర్ లు అయ్యాయి. అందులో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘ఓకే కన్మణి ఒకటి. తెలుగులో ఓకే బంగారంగా వచ్చిన ఈ చిత్రం ఇక్కడా బాగానే ఆడింది. దీంతో ఏడాది క్రితం వీరిద్దరు జంటగా వచ్చిన 100 డేస్ ఆఫ్ లవ్ ను తెలుగులో దించారు. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ జంట మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుందా చూద్దాం.

విశ్లేషణ

ఓ రొమాంటిక్ కామెడీ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు జెన్యూజ్ మహ్మద్. కానీ, ఈ క్రమంలో అతను చాలా తడబడ్డాడనే అనుకోవచ్చు. లీడింగ్ పెయిర్ ఫెర్ ఫెర్మాన్స్ బాగా కుదిరినప్పటికీ, స్లో నారేషన్ తో విసుగుపుడుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ మొత్తం హీరోయిన్ ను వెతుకుంటూ హీరో తిరగటంతో పెద్దగా ఆకట్టుకోదు. సెకంఢాఫ్ లో హీరో, హీరోయిన్ జర్నీ ప్రారంభమై ఊపు తెప్పించినప్పటికీ మళ్లీ అక్కడా కథ నెమ్మదించడం బోర్ గా అనిపిస్తుంది. ఉన్నంతలో హీరో ఫ్రెండ్ కామెడీ ట్రాక్ లు, హీరోహీరోయిన్ల మధ్య సెటైరిక్ డైలాగులు కొంచెం ఆకట్టుకుంటాయి.

ఇక నటీనటుల విషయానికొస్తే... రావుగోపాల్ రావుగా దుల్కర్ సల్మాన్ మరోసారి ఆకట్టుకున్నాడు. మమ్ముటి కొడుకుగా నటవారసత్వం అందుకున్న ఇతగాడు నటనలోనూ అదే స్థాయిని కనబరుస్తున్నాడని ఈ చిత్రంతో మరోసారి నిరూపించుకున్నాడు. హీరోయిన్ గా నిత్యామీనన్ జీవించేసింది. ఫర్ ఫెక్ట్ నటి అనే బిరుదును మరోసారి సార్థకం చేసుకుంది. హీరో ఫ్రెండ్ గా చేసిన వ్యక్తి బాగా అలరించాడు. హీరోయిన్ తల్లిదండ్రులుగా వినీత్-ప్రవీణలు ఫర్వాలేదనిపించారు.

టెక్నికల్ విషయానికొస్తే... డల్ గా సాగే కథనానికి తగ్గట్లే సినిమాటోగ్రఫీ అందించాడు ప్రతీశ్ వర్మ. కానీ, లోకేషన్లను మాత్రం చాలా అందంగా చూపించాడు. కృష్ణచైతన్య సాహిత్యం, గోవింద మీనన్ సంగీతం సో సోగానే ఉన్నాయి . బిజిబల్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఒక్కటే కాస్త ఊరటనిస్తుంది. ఎడిటర్ సందీప్ మరింత శ్రద్ధ వహించాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్య్సూ జస్ట్ ఓకే. శశాంక్ వెన్నెలకంటి రాసిన డైలాగులు కొన్ని ఆకట్టుకుంటాయి.

ఫ్లస్ పాయింట్లు
నిత్యా మీనన్ నటన
బ్యాగ్రౌండ్ మ్యూజిక్

 

మైనస్ పాయింట్లు
కథ
స్క్రీన్ ప్లే
దర్శకత్వం

తీర్పు:
మళయాళంలో యావరేజ్ హిట్ గా ఈ చిత్రాన్ని కేవలం నిత్యామీనన్ ఉందన్న ఒకే ఒక్క కారణంతో తెలుగులో అనువదించారనేది ఎవరికైనా అర్థమైపోతుంది. కానీ, నత్తనడకన సాగే కథా, కథనం, వెరసి సినిమా అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది.

చివరగా... 100 డేస్ ఆఫ్ అవ్ భరించలేనంత స్లోగా సాగే ప్రేమకథ.

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.