Teluguwishesh వేట వేట Veta 2014 Telugu Movie Review, Srikanth Veta Movie Review, Tarun Veta Movie Review, Veta New Movie Review, Veta Telugu Movie Review, Veta Movie 2014, Veta movie stills, Veta movie Trailers, Veta movie Wallpapers, Songs and more on teluguwishesh.com Product #: 51164 2.3/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    వేట

  • బ్యానర్  :

    తేజా సినిమా బ్యానర్

  • దర్శకుడు  :

    అశోక్ పల్లె

  • నిర్మాత  :

    సి.వి.రావు, పి.శ్వేతలానా, సి.వరుణ్ కుమార్,

  • సంగీతం  :

    చక్రి

  • సినిమా రేటింగ్  :

    2.3/52.3/5  2.3/5

  • ఎడిటర్  :

    గౌతం రాజు

  • నటినటులు  :

    శ్రీకాంత్, తరుణ్, మధురిమ, జాస్మిన్

Veta 2014 Telugu Movie Review

విడుదల తేది :

Mar 21, 2014

Cinema Story

కాలేజీ స్టూడెంట్ తన కళ్ళ ఎదుట జరిగిన అన్యాయానికి ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అన్న అంశాన్ని తీసుకుని అల్లుకున్నదే ఈ ‘వేట’.

హైదరాబాదులో చిన్నచిన్న దందాలు చేసుకుంటూ బ్రతికే భాగ్యరాజ్, జగన్ (శ్రీకాంత్) వల్ల డాన్ గా ఎదుగుతాడు. అనుకోని పరిస్థితుల్లో చేయని తప్పును తనఫై వేసుకొని జగన్ జైలుకు వెళ్ళవలసి వస్తుంది. బెంగుళూరులో చదువుకునే జగన్ తమ్ముడు కార్తీక్(తరుణ్) హైదరాబాదుకి ఉద్యోగం కోసం వచ్చి భాగ్యరాజ్ గ్యాంగ్ లో మురళి అనే పేరుతో జాయిన్ అవుతాడు.

భాగ్యరాజ్ దగ్గర పనిచేస్తూనే, అతని చెల్లి (మధురిమ)కు మరియు తమ్ములకు దగ్గరవుతాడు. కార్తీక్ బెంగుళూరులో చదువుకునే సమయంలో అదే కాలేజీలో చదువుతున్న ‘జాస్మిన్ బేసిన్’ ను చూసి ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ప్రేమకోసం కాసిన ప౦దేంలో గెలిచి, జాస్మిన్ ప్రేమను పొందుతాడు.

ఒక ల్యాండ్ సెటిల్మెంటు విషయంలో, తనతో వచ్చిన భాగ్యరాజ్ మొదటి తమ్మున్ని కార్తీక్ నరికి చంపుతాడు. అలాగే, రెండో సెటిల్మెంటులో రెండవ తమ్మున్ని చంపుతాడు. భాగ్యరాజ్ తన తమ్మున్ని చంపినవాళ్ళను వెతికే క్రమంలోనే మధురిమకు తనకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తాడు. తను వచ్చిన పని అయిపోగానే కార్తీక్ అక్కడనుండి వెళ్ళిపోతాడు.

ఇంతలో జైలులో ఉన్న జగన్ రిలీజ్ అయ్యి రాజ్ దగ్గరకు వచ్చి, అతడి తముళ్ళని చంపిన వాడికోసం వెతుకుతుండగా, తనతమ్ముడే చంపాడని తెలుసుకుంటాడు. ఈ విషయం తెలిసిన భాగ్యరాజ్ కార్తీక్ ని చంపాలనుకు౦టాడు. కార్తీక్ మాత్రం ప్రవల్లిక, అజయ్ ల చావుకు ప్రతీకారంగా వాళ్ళను చంపానని చెప్తాడు.

ఇంతకీ.. ఈ ప్రవల్లిక ఎవరు..? కార్తీక్ కి డాన్ తమ్ముళ్ళని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? వాళ్ళకు కార్తీక్ కి ఉన్న సంబంధం ఏమిటి..? భాగ్యరాజ్ తన తమ్ముళ్ళ చావుకి పగ తీర్చుకున్నడా...? కార్తీక్ ని జగన్ ఎలా కాపాడుకున్నాడు వంటి సందేహాలన్నీ.. తీర్చికోవటానికి సినిమా హాలుకి వెళ్లి చూడండి, పూర్తిగా తెలుస్తుంది.

cinima-reviews
వేట

దర్శకుడు అశోక్ ఆలే, ఒక పాత రివెంజ్ కథను కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ, కథ లోగాని, స్క్రీన్ ప్లేలో గాని చాలా లోటు కనబడింది. అలానే, ఈ కథానాయిక నుండి హావాభావాలు రాబట్టడంలో కుడా దర్శకుడు విఫలమయ్యాడు. కథలో లవ్ స్టోరీ ఎపిసోడ్, అంటించినట్లుగా ఉంది.

Cinema Review

ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీకాంత్ గురించే, జగన్ అనే తనపాత్రకు న్యాయం చేశాడు. కథానాయకుడు తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ లో నుండి బయటకు వచ్చి, మాస్ హీరోగా మారేలా ప్రయత్నం చేశాడు. కానీ, మొదటి అర్ధభాగంలో నటన సాధారణంగానే ఉంది.  కథానాయక జాస్మిన్ బేసిన్ నటన తెరఫై అస్సలు బాగా లేదు. లిప్ సింక్ లో గాని, నటన, మొహంలో హావాభావాలు అన్నీ ప్రతీ సీన్ లోనూ ఒకేలా ఉన్నాయి. విలన్ గా చేసిన ఆర్టిస్ట్ నటన కాస్త బాగున్నా., మధురిమ మాత్రం స్విమ్మింగ్ ఫూల్ డ్రెస్ లో అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం అయ్యింది.

సాంకేతిక నిపుణుల ప్రతిభ:

ఈ చిత్రానికి కెమెరామెన్ పనితనం,  చక్రి మ్యూజిక్ ఆకట్టుకోలేకపోయాయి.

ప్లస్ పాయింట్స్:

శ్రీకాంత్

మైనస్ పాయింట్స్:

స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.

చివరి మాట:

 ఈ సినిమా ప్రేక్షకుడికి అర్థంకానీ వేటగానే మిగిలిపోయింది.