Nitin heart attack movie trailer review

Nitin Heart Attack Movie Trailer Review, Nitin Heart Attack Movie Trailer talk, Heart Attack Movie Trailer Talk report, , Nitin Puri Jagannath Heart attack trailer Talk, Nitin Heart Attack movie

Nitin Heart Attack Movie Trailer Review, Nitin Heart Attack Movie Trailer talk, Heart Attack Movie Trailer Talk report, , Nitin Puri Jagannath Heart attack trailer Talk, Nitin Heart Attack movie

ట్రైలర్ పూరీ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది

Posted: 12/03/2013 04:06 PM IST
Nitin heart attack movie trailer review

ఈ మధ్య కాలంలో సినిమా ట్రైలర్లు ఢిఫరెంటుగా క్రియేట్ చేసి సినిమాకు కావాల్సిన హైప్ ని, పబ్లిసిటినీ సంపాదించుకుంటున్నారు. సినీ జనాలు కూడా వాటిని చూసే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అన్న అంచనాకు కూడా వస్తున్నారు. సినిమా ట్రైలర్లు బాగుండి సినిమా పేలినవి కూడా ఉన్నాయి.

వాటి సంగతి పక్కన పెడితే విడుదలకు ముందు ఏర్పడిన క్రేజ్ భారీ బారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్ కూడా. ఇక పోతే నిన్న యంగ్ హీరో నితిన్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ‘హార్ట్ ఎటాక్ ’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. పూరి సినిమా అనగానే భారీ పంచ్ డైలాగులు ఆశిస్తారు. ఇన్ని రోజులు తనదైన డైలాగ్స్ తో అలరించిన పూరీ ట్రైలర్ ఎలా ఉందని సినిమా జనాలు ఆరా తీస్తే... ఈ హార్ట్ ఎటాక్ ట్రైలర్ సినిమా ‘జనాల ’ హార్ట్ ను టచ్ చేసే విధంగా లేదనే టాక్ వినిపిస్తోంది.

ఒక్క డైలాగూ వినిపించకపోగా, పూరీ ఎక్కుడ శాతం నితిన్ డాన్సుల పై, యాక్షన్ మూమెంట్స్ పైనే శ్రద్ద పెట్టారు. గత సినిమాల ట్రైలర్లలో ఒక్క పంచ్ డైలాగ్ అయినా ఉండేట్లు చూసుకున్న పూరీ ఇందులో ఏమీ పెట్టకపోయే సరికి సినీ జనాలు కాస్తంత హర్ట్ అయ్యారని అంటున్నారు. సాదా సీదా ఉన్న ఈ ట్రైలర్ ని ప్లాన్ చేసి, మాట‌ల తూటాల‌న్నీ థియేట‌ర్‌లోనే పేల్చాల‌ని పూరి ఫిక్సయ్యాడో ఏమో గానీ ట్రైలర్ టాక్ మాత్రం అంతంత మాత్రమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles