రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై కాంగ్రెస్ నాయకులే విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంద్ర కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో యుద్దం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో తెరపైకి కొత్త విషయం బయట ప్రజల్లో నానుతుంది. అతి త్వరలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో.. సమైక్యాంద్ర కోసం సీమాంద్రలో ఒక కొత్త పార్టీ వస్తుందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అదే రేంజ్ లో సీమాంద్ర నాయకులు కూడా .. కొత్త పార్టీ పై మొగ్గు చూపుతున్నారని కొన్ని రాజకీయ పార్టీలు గోల చేస్తున్నాయి.
సమైక్యాంద్ర కోసం పుట్టి పార్టీ వెనుక కిరణ్ హస్తం ఉందని, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ విమర్శలపై ముఖ్యమంత్రి ఇప్పటి ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో.. కొత్త పార్టీ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమైక్యాంద్ర కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే.. నేను 10 లక్షలు చందా ఇస్తానని మీడియా సాక్షిగా.. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రా రెడ్డి సవాల్ విసరటం జరిగింది. దీంతో కాంగ్రెస్ నాయకులు ఖంగుతిన్నారు. కాంగ్రెస్ నాయకులే ఇలా మీడియా ముందే సవాల్ ప్రతి సవాల్ విసురుకుంటుంటే.. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మాత్రం నూతన భయంతో వణికిపోతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ఎంత గొప్పవాడో, ప్రజలకు ఎంత సేవ చేశాడో తెలియాలంటే.. తప్పనిసరిగా సమైక్యాంద్ర కోసం కొత్త పార్టీ పెట్టాలని డీఎల్ డిమాండ్ చేయటం జరిగింది. సీఎంకు డబ్బులు వసూలు చ చేసే మిత్రులు తప్పితే సొంత కుటుంబలోనూ ఆయనకు మిత్రులు ఉండరని డీఎల్ అన్నారు. కిరణ్ పార్టీ పెడితే.. చందా ఇవ్వటానికి నాలాంటి వారు చాలా మంది ఉన్నారని ఢిల్లీ చెప్పినట్లు సమాచారం. గతంలో ఈ ఇద్దరి మద్య నడిచిన వార్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు చందా పేరుతో.. ముఖ్యమంత్రికి దగ్గరైతే.. రాబోయే రోజుల్లో.. రాజకీయ పదవి దక్కుతుందనే ఆశతో.. డిఎల్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని.. కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో చెవులుకొరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more