గత రెండు మూడు సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంతాలలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ తెలంగాణ తల్లి విగ్రహం పై మాదిగ దండోరా నాయకుడు మందా క్రిష్ణ మండిపడ్డారు. అసలు తెలంగాణ తల్లే లేదని, ఇప్పుడు తెలంగాణ తల్లి ఎక్కడ నుంచి పుట్టకొచ్చిందని, తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తున్న రూపం ఎవరిదో అందరికి తెలుసునని ఆయన కేసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకోని కామెంట్ చేయటం జరిగింది. అసలు తెలంగాణ తల్లే లేదని ఆయన అంటున్నారు.
తెలుగు తల్లికి తల్లి లేదు, తండ్రి లేడు, అలాంటి తెలుగు తల్లి ఎక్కడ పుట్టిందని కేసిఆర్ అనేక సార్లు తెలుగు తల్లి విగ్రహం పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే అసలు తెలంగాణకు తల్లే లేదు.. అలాంటిది తెలంగాణ తల్లి రూపం ఎవరిది? ఎక్కడ నుంచి వచ్చిందని మందా క్రిష్ణ అడిగినట్లు సమాచారం. తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో.. కేసిఆర్ కూతురు కవిత రూపం కనిపిస్తుందని, అందుకు కావల్సిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని మందా అంటున్నారు. అయితే గతంలో.. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించే సందర్భంలో.. అక్కడికి కేసిఆర్ కూతురు ముఖ్య అధితిగా రావటం జరిగింది. ఆ సమయంలో.. తెలంగాణ తల్లి విగ్రహం పక్కన కేసిఆర్ కూతురు కవిత నిలబడితే.. తెలంగాణ తల్లి విగ్రహంలో కేసిఆర్ దొరతనం కనిపిస్తుందని ఆయన అన్నారు. దొర కుటుంబానికి తెలంగాణ ప్రజలు పూల దండలు వేసి, పూజాలు చేయాలా? అని మందా ప్రశ్నించటం జరిగిందని మీడియా వర్గాలు అంటున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే.. తెలంగాణ ప్రతి పల్లెల్లో.. చాకల ఐలమ్మ విగ్రహాలను , ప్రభుత్వాధికారంతోనే పెడతామని మందా అంటున్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వారి విగ్రహాలు ఉండాలి గానీ, దొరల విగ్రహం తెలంగాణలో ఉండటానికి తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని మందా అన్నట్లు సమాచారం. అయితే మందా క్రిష్ణ తెలంగాణ తల్లి విగ్రహం పై చేసిన కామెంట్ల పై.. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి.. కేసిఆర్ కూతురు కవితకు చాలా తేడా ఉందని, తెలంగాణ తల్లి విగ్రహంలో ఉన్న చీర కట్టుకున్నంత మాత్రం.. కేసిఆర్ కూతరు కవిత, తెలంగాణ తల్లి ఎలా అవుతుందని మందా క్రిష్ణకు కంటి చూపు తగ్గిందేమో ఒక్కసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని, టీఆర్ఎస్ నాయకులు మందాకు ఉచిత సలహాలు ఇవ్వటం జరిగింది. అయితే మందా మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం పై.. ఈనెల 10న తెలంగాణ అమర వీరుల సభలో మాట్లాడటానికి సిద్దమైనట్లు.. సమాచారం.
ఇంక తెలంగాణ ఏర్పాడక ముందే.. ఇలా విగ్రహం గురించి తన్నుకుంటే.. రేపు తెలంగాణ వస్తే.. తెలంగాణలో రాజకీయ పదవుల కోసం తెలంగాణ నేతల ఎలా కోట్టుకుంటారోనని.. తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. ఇప్పుడు కేసిఆర్ కూతురు కవిత విగ్రహం, ఆ తరువాత కేసిఆర్ విగ్రహం, ఇలా తెలంగాణ మొత్తం కేసిఆర్ కుటుంబ విగ్రహాలతో తెలంగాణ నిండిపోతుందేమోనని తెలంగాణ ప్రజలు భవిష్యత్తును ఆలోచిస్తున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more