రాష్ట్రం మొత్తం మూడు విడదతలగా గ్రామ పోరు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం మీద ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల విషయంలో మూడు రాజకీయ పార్టీ తమ సత్తా చాటుకున్నాయి. ఏకగ్రీవంగా సర్పంచ్ పదవి ఎన్నికైన అభ్యర్థుల సంఖ్య తెలుగుదేశం పార్టీకే అధికంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండో స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. నిన్నటితో.. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగించిపోయింది. ఇక మిగిలింది బరిలోకి దిగే గ్రామ సర్పంచ్ పోటీదారులే. అయితే గ్రామ పోరు తీవ్రస్థాయిలో ఉన్నట్లు సమచారం. ప్రత్యర్థుల పోటీని తట్టుకోనేందుకు ఆయన పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు , రాజకీయ పార్టీలు సిద్దమైనట్లు సమాచారం. అయితే టిడిపి పార్టీ నుండి గ్రామ పోరులో నిలుచున్న సర్పంచ్ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడుతో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ప్రత్యర్థుల పోటీ ని తట్టుకోవాలంటే.. పార్టీ ఫండ్ ఇవ్వాలని వారు డిమాండ్ చెయ్యటంతో.. ఆ వారి డిమాండ్ పై బాబుకు ఎక్కడో కాలిపోయి, ఆవేశంగా.. గ్రామ పంచాయతీ ఎన్నికల ఖర్చుకు పార్టీ ఫండ్ ఒక్క ఫైస్ కూడా ఇవ్వదని ఖచ్చితంగా సైకిల్ బెల్ కొట్టి మరి చెప్పటంతో, తెలుగు తమ్ముళ్లు ముఖాలు ఒక్కసారిగా మాడిపోయినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పార్టీ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సర్పంచ్ అభ్యర్థులకు ఇవ్వదని గట్టిగా చంద్రబాబు చెప్పినట్లు పార్టీ కార్యకర్తలు అంటున్నారు. అంతేకాకుండా గ్రామ సర్పంచ్ పదవులకు నిలబడిన అభ్యర్థులంతా , ఎమ్మెల్యే ల బంధువులు, వారి అనుచరులే కాబట్టి, గ్రామ పంచాయతీ ఎన్నికల ఖర్చును కూడా వారే భరించాలని బాబు సూచించినట్లు సమాచారం. బాబు చెప్పిన బ్యాడ్ న్యూస్ విన్న టిడిపి సర్పంచ్ అభ్యర్థులు తెల్లముఖంతో పార్టీ భవనం నుండి వెళ్లిపోవటం జరిగింది. కానీ వారు మాత్రం గ్రామంలో పైసలు పెట్టకుండా గెలవటం చాలా కష్టం కాబట్టి, మనం ప్రయత్నం మనం చేద్దాం.. గెలిస్తే .. సర్పంచ్ లు అవుతాం, లేకపోతే పార్టీ కార్యకర్తలగానే మిగిలిపోతాం అని టిడిపి సర్పంచ్ అభ్యర్థులు గుసగుసలాడుకుంటూ.. పార్టీ భవనం మెట్లు దిగి వెళ్లిపోవటం జరిగింది.
కానీ కొంత మందికి మాత్రం వారి ఇగో ఫీలింగ్ దెబ్బతినటంతో.. మా గ్రామంలో నా ప్రత్యర్థికి సపోర్టు చేసి గెలిపిస్తాను. అప్పుడు నాకు డబ్బుల ఖర్చు ఉండదని ఇగో ఫిలింగ్ తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ, బాబు పై కామెంట్స్ చేస్తూ, చిరాకుగా.. టిడిపి భవనం నుండి ఆగమేఘాల మీద వెళ్లిపోయినట్లు పార్టీ కార్యకర్తలు అంటున్నారు. అతి కొద్ది మంది మాత్రం బాబు చెప్పిన మాటలకు మద్దతు పలుకుతున్నారు. తొమ్మిది సంవత్సరాల నుండి అధికారం లేదు కాబట్టి, ఫండ్ విషయంలో పార్టీ అధినేత ఆచితూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ద్రుష్ట్యా చంద్రబాబు అలా మాట్లాడి ఉంటాడని, వారి మనస్సుకు తగిలిన గాయలకు బాబు తైలం రాసుకుంటూ, వారిలో వారికే నచ్చచెప్పుకోని.. తెలుగుదేశం పార్టీ కార్యలయం నుండి వెళ్లుతూ.. ఈ సారైన మన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ వెళ్లినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏమైన బాబు బ్యాడ్ న్యూస్ తో తెలుగు తమ్ముళ్లు మనస్సు చిరిగిపోయిందనే విషయం మాత్రం సత్యం. ఈ బాధతో గ్రామ పోటీ నుంచి తెలుగు తమ్ముళ్లు ఎలా బయటపడతారో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more