Tdp own news channel

TDP own news channel , nara lokesh babu secret tour in delhi, Chandra Babu, nara lokesh babu, tdp, telugudesam party, tdp leaders, breaking news, ap politics, political news, andhra news, junior ntr, sudiou n news channel, chandrababu naidu padayatra, 2014 election,

TDP own news channel

మీడియా కోసం లోకేష్ బాబు పరుగులు?

Posted: 07/16/2013 11:00 AM IST
Tdp own news channel

అవును మీరు చదివిన వార్త నిజమే. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు మీడియా కోసం పరుగులు తీస్తున్నారు. ఎలాగై రాబోయే ఎన్నికల నాటికి మీడియాను తన సొంతం చేసుకోనే పనిలో బిజీగా, రహస్యంగా యాత్రలు సాగిస్తున్నారు. అయితే పార్టీలోని నాయకులు దూరంగా పెట్టి, లోకేష్ ఒక్కడే మీడియా కోసం పరుగులు తీస్తున్నారు. మీడియా కోసం పరుగులు అంటే.. తెలుగుదేశం పార్టీ తరుపున సొంత ఛానల్ పెట్టేందుకు చంద్రబాబు ఆద్వర్యంలో లోకేష్ బాబు దూకుడు పెంచాడు. అదేంటీ టిడిపి సొంత మీడియా ఛానల్ ( స్టూడియ్ ఎన్ ) ఉంది కాద అని అనుకుంటారు. కానీ ఇటీవల ఆ ఛానల్ టీడీపీ బాబులను దూరంగా పెట్టింది. అంతేకాకుండా గతంలో ఆ ఛానల్ విషయానలు లోకేష్ బాబు స్వయంగా చూసేవాడు. కానీ పరిస్తితులు మారిపోవటంతో.. లోకేష్ ‘బాబు’ ను ఆ ఛానల్ బయటకు నెట్టేసిందే విమర్శలు మీడియా వర్గాల మద్య వినిపిస్తున్నాయి.

 

చంద్రబాబు పాదయాత్రలో మొదట ఆ ఛానల్ ప్రతినిత్యం వహించినప్పటికి, చివర రోజుల్లో మాత్రం ఆ ఛానల్ చంద్రబాబు చుక్కులు చూపించదట. ఆ సమయంలో బాబు మరో ఛానల్ కు కోట్లు రూపాయలిచ్చి మీడియా ప్రచారం చేసుకున్నట్లు కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేశాయి. దీంతో ఎన్నికల సమయానికి ఎలాగైనా ఒక సొంత చానల్‌ను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఎంతోకాలం నుంచి కసరత్తు చేస్తున్న లోకేష్ దాన్ని కార్యరూపంలో పెట్టేందుకు ఢిల్లీకి వెళ్లారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించిన ఒక చానల్‌ను కొనుగోలు చేసేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారట. ఆ చానల్ కొనుగోలుకు అవసరమైన సొమ్మును రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నేత ఒకరు సమకూర్చారట, అంతేకాకుండా పార్టీకి అనుకులంగా పనిచేస్తున్న పాత్రికేయులను ఆ చానల్‌లో పని చేసేందుకు ఇప్పటికే లోకేష్ స్వయంగా ఎంపిక చేశారని టిడిపి నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

 

జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం ఎలా ఉంటుందో లోకేష్ బాబు స్వయంగా చూసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మామ ఛానల్ పై అధిపత్యం చలాయిస్తున్న లోకేష్ ఎన్టీఆర్ దెబ్బ ఏమిటో స్వయంగా చూసినట్లు పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఆ అవమానంతోనే.. చంద్రబాబు మీద ఒత్తిడిపెంచి.. సొంత ఛానల్ పెట్టేందుకు లోకేష్ సిద్దమైనట్లు సమాచారం. ఈ ఛానల్ పేరు కూడా పెట్టినట్లు సమాచారం. (ఎల్ ఎన్ సి) ఎల్ అంటే .. లోకేష్. ఎన్ అంటే నారా, సి అంటే చంద్రబాబు అనే అర్థం వచ్చే విధంగా పెట్టినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. దాని సంబంధించిన లోగో కూడా సిద్దమైనట్లు సమాచారం. అయితే ఎన్నికల నాటికి సొంత ఛానల్ వస్తుందని పార్టీ నాయకులు ఆనందంగా ఉన్నరని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more