నందమూరి తారక రామారావు రెండో భార్యగా తెలుగు ప్రజలకు పరిచయం అయిన నందమూరి లక్ష్మీపార్వతి. ఇప్పుడు రాష్ట్రం రాజకీయల్లో ఒక నాయకురాలిగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మరణాంతరం, తెలుగు దేశం పార్టీ నుండి బయటకు వచ్చి, అన్నఎన్టీఆర్ పార్టీ స్థాపించి, రాజకీయ నాయకురాలిగా ఎదిగే ప్రయత్నం చేశారు. కానీ ఆమె అనుకున్నంత ఫలితం రాలేదు. అయితే ఇటీవల కాలంలో లక్ష్మీపార్వతి .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నాయకురాలిగా అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. అంతేకాకుండా నందమూరి కుటుంబ సభ్యులను, తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎన్నో రాజకీయ విమర్శలు చేసి సంచలనం రేపింది.
అయితే రీసెంట్ కేంద్ర మంత్రి పురంథేశ్వరి పై ఘాటైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఢిల్లీ పార్లమెంటలో జరిగింది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హాజరైన లక్ష్మీ పార్వతి, అక్కడ నందమూరి కుటుంబ సభ్యులను చూసి, ఆమె కొత్త చలనం వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో నందమూరి కుటుంబ సభ్యులు, లక్ష్మీ పార్వతి పై చూపించిన ప్రేమానురాగాలు, పలకరింపులు, చూసిన ఆమె మనస్సు పొంగిపోయింది. అన్నగారి కుటుంబ సభ్యులు ఒక్కసారి లక్ష్మీపార్వతికి ఇచ్చిన గౌరవం చూసి కాంగ్రెస్ నాయకులకే కన్నుకుట్టే విధంగా ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. ఆ సమయంలోనే లక్ష్మీ పార్వతి, చంద్రబాబు, బాలయ్యలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.
బాలయ్య మాటలకు లక్ష్మీపార్వతి ఫిదా అయినట్లు టిడిపి నాయకులు చెబుతున్నారు. లక్ష్మీ పార్వతి మనసు మార్చుకోని, మళ్లీ తెలుగు దేశం పార్టీలోకి చేరి తన భర్త ఆశయాలను, నేర్చావేర్చాలనే సంకల్పంతో లక్ష్మీపార్వతి ఉన్నట్లు టీడీపీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. పురంథేశ్వరికి చేసిన గొప్పపనికి ఎన్టీఆర్ తరువాత పురంథేశ్వరి పేరు చెప్పుకుంటారనే మాటలు అక్కడ వినిపించాయి. ఈ మాటలు విన్న లక్ష్మీ పార్వతి, చంద్రబాబు ,బాలయ్యలతో కలిసి ఎన్టీఆర్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చి ఎన్టీఆర్ ఘనతను చాటి చెప్పాలనే ఉద్దేశం ఆమెలో కలిగినట్లు టిడిపి నాయకులు అంటున్నారు.
అయితే త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పే ఆలోచనల్లో లక్ష్మీ పార్వతి ఉన్నట్లు టిడిపి సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. 2014 ఎన్నికల్లో లక్ష్మీ పార్వతి రాజకీయ బరిలోకి దిగదని టిడిపి నాయకులు చెబుతున్నారు. కేవలం పార్టీ కార్యకర్తగానే ఉంటుందని బాబు చెప్పినట్లు టిడిపి కార్యకర్తలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more