Bjp offers pubs till 1 o clock to woo urban voters

pubs till 1 am, bjp in karnataka, congress in karnataka, venkaiah naidu, veerappa moily, prahlad joshi, yeddurappa

bjp offers pubs till 1 o clock to woo urban voters

ఓటర్లకు పబ్ ల ఎర

Posted: 05/05/2013 11:15 AM IST
Bjp offers pubs till 1 o clock to woo urban voters

కర్నాటకలో ఈ రోజు విధాన సభ ఎన్నికలు జరుగుతున్నాయి.  ప్రముఖులంతా ఓటు వేసి వచ్చి తమవంతు వ్యాఖ్యానాలు చేస్తునేవున్నారు.  భాజపా నేతలైతే కాంగ్రెస్ ఓడిపోవటం ఖాయమని, కాంగ్రెస్ నేతలైతే భాజపాతో ప్రజలు విసిగిపోయారు కాబట్టి భాజపా పోవటం ఖాయమని చెప్తూ వచ్చారు.  

భాజపా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద జోషి ఓటు వేసి వచ్చి, ఈ సారి కూడా విజయం మాదే నని, భారీ మెజార్టీ కూడా వస్తుందని జోస్యం చెప్పారు.  కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకుని కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కడతారంటూ తన ఆకాంక్షను వెల్లడి చేసారు.  వెంకయ్యనాయుడు కూడా కర్నాటకలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

ఎవరి ఆశలు, ఆకాంక్షలు వారికుంటాయన్నది సరే కానీ మరీ భాజపా దిగజారుడు ఎన్నికల ప్రచారాన్నే చాలామంది తప్పుపడుతున్నారు.  మేము అధికారంలోకి వస్తే మీకు ఈ సౌకర్యం కలిగిస్తాం, అది చేస్తాం, ఇది చూపిస్తాం అంటూ ఎన్నో హామీలు ఇస్తుంటారన్నది అందరికీ తెలిసిందే.  ఎక్కువగా ప్రజా సంక్షేమ పథకాల బాటలో మన రాష్ట్రం పోతుంటే, పొరుగు రాష్ట్రంలో మాత్రం నగరవాసుల ఓట్లను ఆకర్షించటానికి భాజపా సరికొత్త ఆఫర్ ఇచ్చింది.

అదేమిటంటే, పబ్ లను ఒంటి గంట వరకు అనుమతిస్తారట.  అందరూ ముక్కున వేలేసుకునేట్టుగా, ప్రస్తుతం 11.30 వరకే అనుమతి ఉన్న పబ్ లను మాకు అధికారం కట్టబెడితే మిమ్మల్ని ఒంటిగంట వరకు పబ్ లలో గడపనిస్తామన్నారు భారతీయ జనతా పార్టీ ప్రచారకులు.  హైద్రాబాద్ లో రాత్రి పూట అసలు ఆడవాళ్ళకే అనుమతి లేదంటున్నారు మన రాష్ట్ర అధికారులు.  

మనకు వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎన్ని వింత ఆఫర్లు వస్తాయో చూడాలి.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more